Representative image

New Delhi, May 08:  రాజస్థాన్ మంత్రి మహేష్ జోషి (Mahesh Joshi) కుమారుడిపై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. మంత్రి తనయుడు తనను బ్లాక్ మెయిలింగ్ (Black Mailing) చేసి పలుమార్లు అత్యాచారం చేశాడని, అతని వల్ల తాను గర్భవతిని కూడా అయినట్లు యువతి ఆరోపించింది. దీంతో ఆమె ఫిర్యాదుమేరకు జీరో ఎఫ్‌ఐఆర్ (Zero FIR) నమోదు చేశారు. రోహిత్ జోషి (Rohit Joshi)తనను పలు సందర్భాల్లో రేప్ చేశాడని యువతి ఆరోపించింది. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మంత్రి కుమారుడిపై అత్యాచార కేసుతో పాటూ, కిడ్నాప్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతేడాది జనవరి 8 నుంచి ఏప్రిల్ 17 మధ్య తనను మంత్రి కుమారుడు పలు సందర్భాల్లో రేప్ చేసినట్లు వెల్లడించింది. తనను పెళ్లి చేసుకుంటానని రోహిత్ జోషి ప్రామిస్ చేశాడని, తనను లవ్ చేస్తున్నానని శారీరకంగా వాడుకున్నట్లు యువతి ఆరోపించింది.

మంత్రి తనయుడు తనకు ఫేస్‌బుక్‌లో (Facebook) పరిచయం అయ్యాడని, ఆ తర్వాత గతేడాది జనవరిలో ఇద్దరం నేరుగా కలుసుకున్నట్లు చెప్పింది. తనను జైపూర్‌కు రోహిత్ (Rohit) ఆహ్వానించాడని, దీంతో తాను హోటల్‌కు వెళ్లినట్లు చెప్పింది. అక్కడ తనకు కూల్‌ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడని, ఆ తర్వాత తనపై అత్యాచారానికి (Rape) పాల్పడ్డట్లు ఆరోపించింది. తనను నగ్నంగా ఫోటోలు తీసి, వాటితో తనను బ్లాక్ మెయిలింగ్‌ చేశాడని, వాటిని అడ్డం పెట్టుకొని పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపించింది.

Bihar Shocker: కన్న కూతురిపైనే ప్రతిరోజూ అత్యాచారం, తండ్రి దురాగతాన్ని వీడియో తీసి య్యూట్యూబ్‌లో పెట్టిన కుమార్తె, తల్లి, మేనమామకు తెలిసినా పట్టించుకోని వైనం, బీహార్‌లో అమానుష ఘటన  

ఆ తర్వాత ఢిల్లీలో ఓ హోటల్‌లో తాము భార్య భర్తలుగా చెప్పి రూమ్ తీసుకున్నామని, అక్కడ కూడా తనపై అత్యాచారం చేసినట్లు తెలిపింది. మంత్రి కుమారుడి వల్ల తాను గర్భవతిని కూడా అయ్యానని, కానీ తనకు అబార్షన్ చేయించినట్లు చెప్పింది. యువతి చెప్పిన విషయాలను ఆధారంగా చేసుకొని ఢిల్లీ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే మంత్రి కుమారుడు మాత్రం ఆమె ఆరోపణలను కొట్టిపారేస్తున్నాడు.