Bihar, May08: ఆడపిల్లకు రక్షణ కరువైంది. నిర్భయ (Nirbhaya) లాంటి కఠిన చట్టాలు వచ్చినా, రేపిస్టులను (Rapist) ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. అత్యాచారాలు (Rapes) ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు ఎప్పుడు ఎటువైపు నుంచి విరుచుకుపడతారో తెలియని పరిస్థితి.ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చేవరకు తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితులు నెలకొన్నాయి. వీధుల్లోనే కాదు ఇంట్లోనూ ఆడపిల్లకు భద్రత లేకుండా పోయింది. రక్షణగా నిలవాల్సిన వారే వావివరసలు మరిచి కామంతో కాటేస్తున్నారు. తాజాగా అలాంటి దారుణం ఒకటి జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురిపై కొన్నిరోజులుగా అత్యాచారం చేస్తున్నాడు.
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ ఘటన బీహార్ లోని (Bihar) సమస్తిపూర్ లో (Samastipur) చోటు చేసుకుంది. ఓ తండ్రి(58) (Father) తన 18ఏళ్ల కూతురిపైనే కన్నేశాడు. ఆమె భయపెట్టి కొన్ని రోజులుగా అత్యాచారం (Rape) చేస్తున్నాడు. పశువులా మీద పడి కామవాంఛ తీర్చుకుంటున్నాడు. తనను వదిలేయాలని ప్రాధేయపడుతున్నా ఆ నీచుడు మాత్రం కనికరించలేదు.
అయితే, ఈ దారుణం బాధితురాలి తల్లికి (Mother), మామకు కూడా తెలుసు. అయినా వాళ్లు నోరు మెదపలేదు. ఇంట్లో ఆమెకు ఎవరూ అండగా నిలవలేదు. ఇక లాభం లేదని నిర్ణయించుకున్న అమ్మాయి తన తండ్రి దురాఘతాన్ని తానే బయటపెట్టాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం సీక్రెట్ కెమెరా (Secret Camera) వాడింది. తన గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది. ఈ విషయం తెలియని తండ్రి.. ఎప్పటిలాగే కూతురిపై అత్యాచారం చేసేందుకు వచ్చాడు. దీన్నంతా ఆమె వీడియో తీసింది. ఆ తర్వాత ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు న్యాయం కావాలని వేడుకుంది.
ఈ వీడియో వైరల్ గా మారింది. పోలీసుల వరకు చేరింది. వీడియో తమ దృష్టికి రాగానే పోలీసులు స్పందించారు. వెంటనే రంగంలోకి దిగారు. కామాంధుడిని అరెస్ట్ చేశారు.