Stress (Photo Credits: Pixabay)

Kannur, April 11: కేరళలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని కన్నూర్ పరిధిలో గల తొక్కిలంగడిలోని కెనరా బ్యాంకు మేనేజర్ తన కార్యాలయంలోనే ఉరి వేసుకుని (Woman Bank manager found hanging inside bank) చనిపోయారు.

కన్నూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోక్కిలంగడి కెనరా బ్యాంక్ లో బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్న కె.స్వప్న(38) శుక్రవారం ఉదయం 9 గంటలకు బ్యాంకు కార్యాలయంలో ఉరి వేసుకొని (Bank manager found hanging) చనిపోయారు. మరొక మహిళా బ్యాంకు ఉద్యోగి ఉదయం 9 గంటలకు పని నిమిత్తం బ్యాంకు కార్యాలయంలోకి వెళ్లగానే మేనేజర్ ఉరివేసుకుని కనిపించడం ( Bank manager found hanging inside bank) చూసి బ్యాంకు అలారం నొక్కారు.

వెంటనే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు, బ్యాంకు సిబ్బంది కలిసి ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమెను రక్షించలేకపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం కుతుపరంబా తాలూకా ఆసుపత్రికి తరలించారు. కుతుపరంబా ఎసీపీ కెజి సురేష్, ఎస్ఐ కెటి సందీప్ సంఘటన స్థలానికి చేరుకుని సీసీటివి విజువల్స్ తనిఖీ చేశారు. పోలీసులు స్వప్న డైరీని స్వాధీనం చేసుకున్నారు.

నలుగురి ప్రాణాలు కాపాడిన దిశ యాప్, నల్లమల అడవుల్లో ఆత్మహత్యకు ప్రయత్నించిన కుటుంబం, దిశ యాప్ ద్వారా రక్షించిన కర్నూలు జిల్లా పోలీసులు, యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి, ఎలా వాడాలో ఓ సారి తెలుసుకోండి

దీనిలో ఆమె పని ఒత్తిడిని తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో వ్రాయబడింది. స్వప్నను సెప్టెంబర్ 2020లో తోక్కిలంగడి బ్రాంచ్‌లో పోస్ట్ చేశారు. కన్నూర్‌లోని నిర్మలగిరిలో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. త్రిసూర్ జిల్లాలోని మన్నూతి స్వప్న స్వస్థలంగా పోలీసులు తెలిపారు.