Indore December 30: ఒకటి కాదు, రెండు కాదు ఏకండా నాలుగు వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ(Woman vaccinated 4 times)...ఓ మహిళను కరోనా(Corona) వదల్లేదు. నాలుగు డోసులు పూర్తయిన తర్వాత కూడా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్(Indore) కు చెందిన మహిళకు కరోనా పాజిటివ్ గా తేలింది.
దుబాయ్ కి చెందిన 30 ఏండ్ల మహిళ ఇండోర్ నుంచి దుబాయ్(Dubai) వెళ్లడానికి ఇండోర్ విమానాశ్రయానికి వచ్చింది. నిబంధనల ప్రకారం అధికారులు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె గత జనవరి నుంచి ఆగస్టు మధ్య వివిధ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ నాలుగు డోసులు తీసుకున్నదని అధికారులు తెలిపారు.
ఆమె పన్నెండు రోజుల క్రితం ఇండోర్‌కు వచ్చిందని వెల్లడించారు. మళ్లీ దుబాయ్‌కి వెళ్లాల్సి ఉండగా.. ప్రయాణానికి ముందు రోజు కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. అయితే తాము నిర్వహించిన ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో ప్రతి ఒక్కరు అప్రమత్తమయ్యారు. అర్హులైనవారంతా వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. అయితే వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల కరోనా సోకకుండా ఉండదని, కేవలం కరోనా నిబంధనలు కఠినంగా పాటించడమే రక్ష అంటున్నారు నిపుణులు. ఎన్ని వ్యాక్సిన్లు తీసుకున్పప్పటికీ కరోనా నిబంధనలను పాటించకపోతే వైరస్ సోకే అవకాశం ఉంటుందని, అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రాణాపాయం తప్పుతుందంటున్నారు వైద్యులు.