Washington December 29: అగ్రరాజ్యం అమెరికా(America)ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4,41,278 కరోనా కేసులు(Corona Cases) రికార్డయ్యాయి. అయితే ఇందులో సగానికిపైగా ఒమిక్రాన్(Omicron Cases) కేసులే ఉండటం కలకలం రేపుతోంది. డిసెంబర్ 25తో ముగిసిన వారంలో నమోదైన కొత్త ఇన్ఫెక్షన్లలో 58.6 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని సీడీసీ తెలిపింది. ఈ వారంరోజుల్లో సగటున రోజుకు 240,000 కంటే ఎక్కువ కేసులే నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు(Covid-19 Cases) 11 శాతం పెరిగాయి.
తాజా వేరియంట్ వల్ల ముప్పు అధికంగానే ఉందని సీడీసీ(CDC) అభిప్రాయపడింది. బ్రిటన్, దక్షిణాఫ్రికా(South Africa), డెన్మార్క్(Denmark) దేశాల నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి.. ఆస్పత్రుల్లో చేరే ముప్పు తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. ఒక్క కాలిఫోర్నియా(California) రాష్ట్రంలోనేలో ఇప్పటివరకు 50 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు వచ్చిన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. కేవలం కాలిఫోర్నియాలోనే 75,500 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా మంగళవారం 2,969 విమానాలు రద్దయ్యాయి. 11,500 వాయిదా పడ్డాయి. అయితే అమెరికాలోనే ఏకంగా 1,172 విమానాలు రద్దయ్యాయని.. 5,458 విమాన సర్వీసులు వాయిదా పడ్డాయని ‘ఫ్లైట్అవేర్’ అనే వెబ్సైట్ వెల్లడించింది.