London, Dec 29: యూరోపియన్ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. బ్రిటన్‌లో మళ్లీ కరోనా కల్లోలం మొదలైంది. నిన్న ఒక్క రోజులోనే అక్కడ రికార్డు స్థాయిలో ఏకంగా 1,29,471 కేసులు (hit record high of 129,471) నమోదయ్యాయి. గతవారం అంటే డిసెంబరు 21న దేశంలో 90,625 కేసులు నమోదు కాగా, ఇప్పుడు ఏకంగా 42 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా గత వారం రోజుల వ్యవధిలో 8 లక్షల మందికిపైగా వైరస్ (COVID in UK) బారినపడ్డారని, అంతకుముందు వారంతో పోలిస్తే ఇది 30.3 శాతం అధికమని అధికారులు తెలిపారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (Prime Minister Boris Johnson) న్యూ ఇయర్ సందర్భంగా ఒమిక్రాన్ కరోనాైవైరస్ కట్టడికి ఎటువంటి ఆంక్షలు విధించబోమని చెప్పిన ఒక రోజు తర్వాత ఈ స్థాయిలో కేసులు వెలుగుచూశాయి. ఇంగ్లాండ్‌లో ఎటువంటి కొత్త ఆంక్షలను ప్రవేశపెట్టనని జాన్సన్ సోమవారం తెలిపారు. అయితే మంత్రులు మాత్రం నూతన సంవత్సరాన్ని జాగ్రత్తగా జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఆరోగ్య వ్యవస్థ విఫలమయ్యే ప్రమాదం ఉంటే నిబంధనలను కఠినతరం చేయవచ్చని ప్రజలను హెచ్చరించారు.
కేసులు దారుణంగా పెరిగిపోతుండడంతో ‘రూల్ ఆఫ్ సిక్స్’ను తిరిగి తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ మాత్రం కొత్త సంవత్సరానికి ముందు ప్రజలపై ఎలాంటి కొత్త ఆంక్షలు విధించబోమని చెప్పడం గమనార్హం. ప్రభుత్వ కరోనా వైరస్ డ్యాష్‌బోర్డు ప్రకారం.. డిసెంబరు 23 నాటికి పాజిటివ్ కేసుల వారం రోజుల రోలింగ్ రేటు ప్రతి లక్ష మందికి 1,145.4గా ఉంది.
వేల్స్, స్కాట్లాండ్ మరియు నార్తర్న్ ఐర్లాండ్‌ల కోసం డెవలప్‌డ్ అథారిటీలు ఇప్పటికే తమ నిబంధనలను కఠినతరం చేశాయి, బ్రిటీష్ ప్రభుత్వం ఇంగ్లాండ్‌కు లాక్‌డౌన్ పరిమితులను సడలింపులు ఇచ్చింది. క్రిస్మస్ సెలవుల్లో రిపోర్టింగ్ పద్ధతుల్లో తేడాల కారణంగా మంగళవారం నాటి డేటాలో స్కాట్లాండ్ మరియు ఉత్తర ఐర్లాండ్ గణాంకాలు లేవు. వేల్స్‌లో నివేదించబడిన 12,378 కేసులలో సాధారణంగా మునుపటి రోజులలో నివేదించబడే డేటా ఉంది. ఇతర యూరోపియన్ దేశాలు ఓమిక్రాన్ కేసుల పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి.
ఇక ఫ్రాన్స్ నగరంలో కరోనా విలియతాండవం చేస్తోంది. దేశంలో గత 24 గంటల వ్యవధిలో 1,79, 807 మంది కరోన బారీన పడ్డారు. మహమ్మారి ప్రారంభం నుంచి ఒక్కరోజులో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారని జాతీయ ప్రజారోగ్య సంస్థ ప్రకటించింది. ఈ నెల చివరి నాటికి భారీ స్థాయిలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని ఫ్రెంచ్ ఆరోగ్య మంత్రి ఒలివర్ వెరాన్ తెలిపారు. దేశంలో ఇప్పటికే 77 శాతం మంది కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో తీసుకున్నారు. ఇక ఇటలీలో కూడా 78, 300 కొత్త కేసులు నమోదయ్యాయి.