Droupadi Murmu. (Credits: ANI)

ఇటీవల పార్లమెంట్‌ ద్వారా ఆమోదించబడ్డ మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ రిజర్వేషన్‌ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో చట్ట రూపంలోకి వచ్చింది. కాగా, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ఇటీవల పార్లమెంట్‌లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఇరు సభల్లోనూ ఆమోద ముద్ర పడింది.

రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటంతో మహిళా బిల్లు చట్ట రూపం దాల్చింది. తర్వాత మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నూతన జన గణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. దీనికి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది. ఇది 2029 కల్లా జరిగే అవకాశముంది.