Chennai, JAN 17: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అలంగనల్లూరు జల్లికట్టు ఉత్సవాలు (Alanganallur Jallikattu Festival) బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ మరుసటి రోజు మధురై సమీపంలోని అలంగనల్లూర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ జల్లికట్టు (Alanganallur Jallikattu Festival)ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా జనం భారీగా తరలివస్తారు.
#WATCH | Tamil Nadu: World-renowned Alanganallur Jallikattu festival begins in Madurai pic.twitter.com/3dNnTtlf2c
— ANI (@ANI) January 17, 2024
ఈ ఉత్సవాలను ప్రత్యక్షంగా వేల మంది వీక్షిస్తారు. ఎద్దులను బరిలోకి వదిలి.. వాటిని లొంగదీసుకోవడం అనేది ఈ క్రీడలోని ప్రధానమైన అంశం. ఎద్దులను లొంగదీసుకునేందుకు యువకులు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు.
#WATCH | Tamil Nadu Sports Minister Udhayanidhi Stalin flags off the bull-taming sport Jallikattu pic.twitter.com/CpjmLbtU7Y
— ANI (@ANI) January 17, 2024
ఈ ఉత్సవంలో పలువురు తీవ్ర గాయాలపాలవుతుంటారు. అయినా ఈ ఉత్సవాలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ఈ జల్లికట్టు ఉత్సవాలను జెండాఊపి ప్రారంభించారు. పోటీలకు ముందు ఎద్దులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. ఉత్సవాల కోసం యువత కూడా ఉత్సాహంగా సిద్ధమయ్యారు.