UP CM Yogi Father Died: యోగి ఆదిత్యనాథ్ తండ్రి కన్నుమూత, యుపీ ముఖ్యమంత్రి ఇంట్లో విషాదం, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Yogi Adityanath's father Anand Singh Bisht (Photo Credits: Twitter)

New Delhi, April 20: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యంతో న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన (Anand Singh Bisht) తుదిశ్వాస విడిచారు. మార్చి 13న ఆయన్ను ఎయిమ్స్‌లో (AIIMS Delhi) చేర్పించారు. డాక్టర్లు తీవ్రంగా యత్నించినా ఆయన్ను కాపాడలేకపోయారు. పెజావర మఠాధిపతి విశ్వేశ్వరతీర్థ ఇక లేరు

కొంతకాలంగా కిడ్నీ,లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో మార్చి-15, 2020న ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. గ్యాస్ట్రాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ నేతృత్వంలో ఆయనకు ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ జరిగింది.అయితే ఆదివారం ఆనంద్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంచింది. దీంతో ఆయనను ఆదివారం సాయంత్రం వెంటిలేటర్ పై ఉంచారు. వెంటిలేటర్ పై ఉన్న ఆనంద్ సింగ్ ఇవాళ(ఏప్రిల్-20,2020)ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కన్నుమూత

ఆదివారం యోగి ఆదిత్యనాధ్ తండ్రిని ఐసీయూ వార్డ్ కి తరలించే ముందు ఆయనకు డయాలసిస్ కూడా నిర్వహించినట్లు ఎయిమ్స్ తెలిపింది. తీవ్రమైన డైహైడ్రేషన్ తో బాధపడుతూ కొన్ని నెలల క్రితం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్..డెహ్రాడూన్ లోని ఓ హాస్పిటల్ లో చేరారు. ఆనంద్‌సింగ్ గతంలో ఉత్తరాఖండ్‌ అటవీశాఖలో రేంజర్‌గా పనిచేశారు.

ANI Tweet

ఆదిత్యనాథ్ తండ్రి మరణానికి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సంతాపం తెలిపారు. బిష్ట్ మరణ వార్త వినడం చాలా బాధగా ఉందని ఆయన అన్నారు. దేవుడు వారి కుటుంబానికి బలం చేకూర్చాలని మౌర్య తెలిపారు.

Keshav Prasad Maurya's Tweet:

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా బిష్ట్ మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

Akhilesh Yadav's Tweet:

బిష్ట్ ఉత్తరాఖండ్ యొక్క యమకేశ్వర్ ప్రాంతంలోని పంచోర్ గ్రామంలో నివసించేవారు. అతను 1991 లో ఫారెస్ట్ రేంజర్ పోస్ట్ నుండి రిటైర్ అయ్యాడు. అతనికి ఏడుగురు పిల్లలు ఉన్నారు. ఆదిత్యనాథ్ అతని రెండవ సంతానం. ఆదివారం సాయంత్రం నుండి బిష్ట్ మరణం గురించి సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. అయితే, ఆ సమయంలో, ఎయిమ్స్ వైద్యుల నుండి అధికారిక ధృవీకరణ లేదు. యోగి ఆదిత్యనాథ్ 1990 లలో తన ఇంటిని విడిచి అయోధ్య రామ్ ఆలయ ఉద్యమంలో చేరారు.1993 లో గోరఖ్నాథ్ మఠం యొక్క ప్రధాన పూజారి మహంత్ అవిద్యానాథ్ శిష్యుడయ్యాడు.