దేశంలో జికా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. మహారాష్ట్ర రాజధాని ముంబయి చెంబూర్ సమీపంలోని ఎం-వెస్ట్ వార్డులో నివాసం ఉంటున్న 79 సంవత్సరాల వ్యక్తికి జికా వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని, బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తి జులై 19 నుంచి జ్వరం, ముక్కు మూసుకుపోవడం, దగ్గుతో సహా పలు లక్షణాలు కనిపించాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జికా వైరస్‌కు నిర్ధిష్టంగా ఏ చికిత్స లేదు. నొప్పి నుంచి ఉపశమనం కోసం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. జికా వైరస్ సాధారణంగా దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఏడిస్ దోమల కారణంగా సోకుతుంది. మనిషిని కుడితే.. జికా సోకే ప్రమాదం ఉంటుంది.
Here's News
BREAKING: Mumbai reports first case of Zika virus; BMC says no need to panic #BMC #Mumbai #MumbaiNews #ZikaVirus #News https://t.co/q22drVi5UM
— Mid Day (@mid_day) August 23, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)