New Delhi, June 12: కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari)ఒక ఎంపీ గారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. నియోజక వర్గంలో అభివృధ్దికి నిధులు కావాలంటే ముందు మీరున్న బరువు తగ్గండి. మీరు తగ్గిన కిలోకి వెయ్యికోట్లు చొప్పున ఇస్తా అని చెప్పారు. దీంతో ఆ ఎంపీగారు (MP) ఇప్పుడు బరువు తగ్గే పనిలో పడ్డారు. వివరాల్లోకి వెళితే…. మధ్యప్రదేశ్ (Madhya pradesh) లోని ఉజ్జయిని ఎంపీ (Ujjain MP) అనిల్‌ ఫిరోజియా (Anil Firojiya)తన నియోజకవర్గంలో రోడ్లు, ఇతర అభివృధ్ది పనుల నిమిత్తం ఒకసారి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం సమర్పించారు. వినతి పత్రం తీసుకున్న గడ్కరీ ఫిరోజియాకు ఒక షరతు విధించారు. తాను నిధులు మంజూరు చేయాలంటే ముందు మీరు చాలా బరువు తగ్గండి అప్పుడూ మంజూరు చేస్తానంటూ ఒక కండిషన్‌ కూడా పెట్టారు. అంతేకాదు ఫిరోజియాకు తాను ఏవిధంగా బరువు తగ్గానో కూడా వివరించి చెప్పారు.

ఈ మేరకు గడ్కరీ మాట్లాడుతూ…తాను గతంలో 135 కిలోలు బరువు ఉన్నానని, ప్రస్తుతం 93 కిలోలే ఉన్నాను. అప్పుడూ ప్రజలు నన్ను అసలు గుర్తు పట్టలేకపోయారు. అందువల్ల మీరు కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నించండి. అంతేకాదు తగ్గిన ప్రతి కిలో బరువుకి వెయ్యి కోట్లు చొప్పున తమ నియోజక వర్గం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తాననంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిరోజియాకి ఒక గొప్ప చాలెంజ్‌ విసిరారు.

Prathyusha Garimella Sucide: సెలబ్రెటీ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య, విషాదంలో టాలీవుడ్, కార్బన్ మోనాక్సైడ్ పీల్చి సూసైడ్, నేను కోరుకున్న జీవితం ఇది కాదంటూ సూసైడ్ నోట్  

దీంతో స్ధూలకాయుడైన ఫిరోజియా (Anil Firojiya) అప్పటి నుంచి తన ఫిట్‌నెస్‌ పై దృష్టి పెట్టారు. అందులో భాగంగా బరువు తగ్గేడమే లక్ష్యంగా పెట్టుకుని రోజూ ఎక్సర్ సైజ్ లు చేస్తున్నారు. రకరకాల వ్యాయామాలు కూడా చేసేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర మంత్రి నియోజకవర్గ అభివృద్ధి పనుల నిధులతో చట్టసభ సభ్యుల శారీరక దృఢత్వాన్ని అనుసంధానించే అభివృద్ధి మంత్రం బాగా పనిచేస్తోందనే చెప్పాలి.

Karnataka Shocker: బెంగుళూరులో దారుణం, పెళ్లికి ఒప్పుకోలేదని వివాహితపై యాసిడ్ పోసిన యువకుడు, కంటికి తీవ్ర గాయం  

ఫిరోజియా కూడా తన నియోజక వర్గం అభివృద్దికి నిధులు మంజూరు చేయించుకునేందుకు అయినా సరే బరువు తగ్గాలని గట్టి పట్టుదలతో బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు వర్షాకాలం సమావేశం కల్లా తగ్గి… ఆయన్ను కలిసి మీరు ఇచ్చిన చాలెంజ్‌ని నెరవేర్చానని గుర్తుచేసి మరీ చెబుతానంటున్నారు కూడా. ఈ మేరకు ఫిరోజియా ఫిరోజియా డైట్ ప్లాన్‌ను పాటిస్తూ…సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా చేస్తున్న వీడియోల సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.