Hyderabad, June 11: టాప్ సెలబ్రిటీల ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (Prathyusha Garimella) ఆత్మహత్య (sucide) చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ వార్త సినీ స్టార్స్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందనే వార్తతో వారు షాక్ లో ఉండిపోయారు. కాగా, ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం (Post martam) పూర్తైంది. శ్వాస ఆగి కార్డియాక్ అరెస్ట్ అయినట్లు డాక్టర్లు తేల్చారు. విషవాయువు పీల్చడం వల్ల శ్వాస ఆగిపోయి చనిపోయినట్టుగా డాక్టర్ల ప్రిలిమినరీ ఒపీనియన్ కు వచ్చారు. తల్లిదండ్రులు రిక్వెస్ట్ మేరకు ప్రత్యూష మృతదేహాన్ని అపోలోకి తరలించారు. ఆదివారం హైదరాబాద్ లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రత్యూష సూసైడ్ చేసుకుందని పోలీసులు తేల్చారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. హీరోయిన్ కృతిశెట్టి, రానా భార్య మిహికా, నిహారికతో పాటు పలువురు సెలబ్రిటీలకు డిజైనర్ గా ప్రత్యూష వ్యవహరించింది.
Top fashion designer Prathyusha Garimella was found dead at her residence in Banjara Hills, Telangana, says police
Police seized a carbon monoxide cylinder from her bedroom. A case is being registered under the section of suspicious death: Circle Inspector
(Image source: FB) pic.twitter.com/e3MetX6qKj
— ANI (@ANI) June 11, 2022
పోలీసులు ప్రత్యూష సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇది తాను కోరుకున్న జీవితం కాదని, తల్లిదండ్రులకు భారంగా ఉండలేనని అందులో ఉంది. ప్రత్యుష గరిమెళ్ల రిటైర్డ్ ఐఆర్ఎస్ కృష్ణారావు కూతురు. ఇండియాలో టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా ప్రత్యూష ఎదిగింది. టాలీవుడ్, బాలీవుడ్ తారలకు ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరించిన ఆమె.. దక్షిణాదిలో దాదాపు అందరు హీరోయిన్లకు డ్రెస్ లు డిజైన్ చేసింది. హీరోయిన్ కృతిశెట్టి, రానా భార్య మిహికా, నిహారికతో పాటు పలువురు సెలబ్రిటీలకు డిజైనర్ గా వ్యవహరించింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని (Banjara hills) తన ఫ్లాట్ లో ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. డిప్రెషన్‌కు గురైన నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఆత్మహత్యకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కార్బన్ మోనాక్సైడ్‌ను స్టిమ్ లో కలుపుకుని పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు కనుగొన్నారు. తన ఇంట్లోని బాత్ రూమ్‌లో ప్రత్యూష విగత జీవిగా పడి ఉన్న విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించి ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.