Blast |Image used for representative purpose. (Photo Credits: IANS)

Hyd, June 8: తెలంగాణలో ఇంటిముందు చార్జింగ్ పెట్టి ఉంచిన ఎలక్ట్రిక్ బైక్ అర్ధరాత్రి సమయంలో పేలింది. దీంతో బైక్ మంటల్లో దగ్దం (Electric bike Explodes) అవ్వటంతో పాటు ఇంటికి మంటలు వ్యాపించాయి. బైక్ పేలుడు సమయంలో భారీ శబ్దం రాడంతో ఇంటిలో నిద్రిస్తున్న వారు లేచి చూడగా ఇంటికి మంటలు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు. అయితే పెంకుటిళ్లు కావడంతో పెద్దగా మంటలు వ్యాప్తిచెందక పోవటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పెద్దచీకోడు గ్రామంలో (electric bike explodes in Siddipet ) చోటు చేసుకుంది.

పెద్దచీకోడులో పుట్ట లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కొద్దిరోజుల కింద ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. మంగళవారం రాత్రి సమయంలో ఇంటి ఆవరణంలో బైక్‌కు చార్జింగ్ పెట్టి నిద్రపోయాడు. చార్జింగ్ ఫుల్ కావటంతో అర్దరాత్రి సమయంలో బైక్ ఒక్కసారిగా పేలింది.

బాలికను రేప్ చేశారని నడిరోడ్డుపై నిందితులను సజీవదహనం చేసిన గ్రామస్తులు, ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం, జార్ఖండ్‌ లో ఘటన

పెద్దశబ్దం రావడంతో ఇంట్లోని సభ్యులు బయటకు వచ్చారు. అప్పటికే ఇంటికి మంటలు వ్యాపిస్తుండటంతో వాటికి నీళ్లుచల్లి ఆర్పేశారు. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పెట్రోల్ ధరలు పెరుగుదలతో ఎలక్ట్రిక్ బైక్ ను కొన్నానని, ఇప్పుడు నిలువనీడ లేకుండా కోల్పాయానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.