Election Commission (photo-ANI)

Newdelhi, May 24: ఏడు దఫాలలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌ సభ ఎన్నికల్లో (Loksabha Elections) ఏకంగా 8,360 మంది పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. అధికారిక వివరాల ప్రకారం.. 1996 ఎన్నికల తర్వాత ఈ ఎన్నికల్లోనే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో 1,874 మంది మాత్రమే పోటీ చేయగా ఇప్పుడు దాదాపు ఈ సంఖ్య నాలుగింతలకు పైగా పెరిగింది. 1952లో సగటున ఒక్కో నియోజకవర్గానికి 4.67 మంది బరిలో ఉండగా ఇప్పుడు 15.39 మంది పోటీ చేస్తున్నారు.

జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం.. ఈ ప్రిలిమ్స్ కు మీరు హాజరవుతున్నారా? అయితే, టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది.. అవేమిటంటే?

గత ఎన్నికల్లో పోటీలో ఎంతమందంటే?

  • 1996 లోక్‌ సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 13,952 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
  • 2019 ఎన్నికల్లో 8,039 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఈ ఎన్నికల్లో 8,360మంది పోటీలో ఉన్నారు.

అమెరికాలో బైక్ ప్రమాదం.. ఏపీ విద్యార్ధి బీలం అచ్యుత్ దుర్మరణం.. విచారం వ్యక్తం చేసిన ఎంబసీ.. మృతదేహాన్ని భారత్‌ కు తరలించేందుకు ఏర్పాట్లు

80 ఏండ్లు పైబడినవారు 11 మంది..

  • ఈ లోక్‌ సభ ఎన్నికల్లో 80 ఏండ్ల పైబడిన వారు 11 మంది పోటీ చేస్తున్నారు.
  • 25-30 ఏండ్ల మధ్య వయస్కులు 537 మంది రంగంలో ఉన్నారు.

121 మంది నిరక్షరాస్యులు

  • ఇక విద్యాపరమైన అర్హతలు పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులు ఉన్నారు.
  • 359 మంది ఐదో తరగతి వరకు చదువుకున్నట్టు తెలుస్తున్నది.
  •  647 మంది 8వ తరగతి వరకు చదువగా, 1,303 మంది 12వ తరగతి పాసయ్యారు.
  • 1,502 మంది గ్రాడ్యుయేట్లు, 198 మంది డాక్టరేట్లు ఎన్నికల బరిలో ఉన్నారు.