Delhi, Aug 14: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో 17 నెలల జైలు శిక్ష తర్వాత ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. 17 నెలలు జైలులో పెట్టిన సత్యాన్ని ఓడించలేకపోయారన్నారు సిసోడియా. ఇక జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత దూకుడు పెంచారు మనీష్.
ఇక షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు సిసోడియా పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు పాదయాత్రను వాయిదా వేసుకోవాలని సూచించగా సిసోడియా ఓకే చెప్పారు. దీంతో పాదయాత్ర ఆగస్టు 16కి వాయిదా పడింది.
యాదృచ్చికమే అయినా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజు ఆగస్టు 16 , అదే రోజు నుండి పాదయాత్రం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని ఆప్ నేతలు తెలిపారు. ఏది జరిగినా అది మన మంచికే..అందుకే కేజ్రీవాల్ పెట్టినరోజు సందర్భంగా పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. మనీష్ సిసోడియా పాదయాత్ర ఢిల్లీలోని అన్ని ప్రాంతాల గుండా సాగనుంది. ఇప్పటికే ఆప్ నేతలు అన్ని ఏర్పాట్లను సైతం పూర్తి చేశారు. 17 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన మనీష్ సిసోడియా, ఘన స్వాగతం పలికిన ఆప్ కార్యకర్తలు, వీడియోలు ఇవిగో..
మరోవైపు లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అనంతరం ఈ విచారణను ఆగస్టు 23కి వాయిదా వేసింది. కేజ్రీవాల్ వేసిన రెండు పిటిషన్లపై న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.