Amit Shah: కలకత్తాలో అమిత్‌షా, గో బ్యాక్ అంటూ వామపక్షాలు, కాంగ్రెస్ నిరసనలు, హోమంత్రి పదవి నుంచి అమిత్ షా తప్పుకోవాలంటూ నినాదాలు
Amit Shah reaches Kolkata amid black flag protest by Left, Cong (Photo-ANI)

Kolkata, Mar 05: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah), భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు (Kolkata) చేరుకున్నారు. అయితే వారి రాకకు వ్యతిరేకిస్తూ నలుపు బెలూన్లతో వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కేంద్రానిదే బాధ్యత అని, హోమంత్రి పదవి నుంచి అమిత్ షా తప్పుకోవాలంటూ నినాదాలు చేశారు.

వాజ్ పేయినే లెక్క చేయలేదు..మీకు మేమెంత..?

ఒక రోజు పర్యటనలో భాగంగా సాహిద్ మినార్ మైదానంలో (Sahid Minar Maidan) బిజెపి ర్యాలీలో అమిత్ షా ప్రసంగించనున్నారు. అలాగే అక్కడ స్పెషల్ కాంపోజిట్ గ్రూప్ కాంప్లెక్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జి) ను ప్రారంభిస్తారు.

అయితే వామపక్ష విద్యార్థి సంఘాలు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్ సమీపానికి చేరుకున్నారు. అమిత్ షా ఎయిర్‌పోర్టుకు చేరకున్నారన్న విషయం తెలియగానే నలుపు బెలూన్లు ఆకాశం వైపు ఎగురవేసి, అమిత్ షా గోబ్యాక్ అంటూ ఫ్లకార్డులతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Here's ANI Tweet

 

ఒక్క వామపక్ష పార్టీలే కాకుండా ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, రాజకీయేతర సంఘాలు అన్ని నిరసనలో పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ఢిల్లీ అల్లర్లకు కారణం బీజేపీయేనని, మతతత్వంతో చేలరేగిన అల్లర్లకు అగ్గి రాజేసింది అమిత్ షాయేనని వారు ఆరోపించారు.

దేశం విడిచి వెంటనే వెళ్లిపో, పోలెండ్ విద్యార్థికి నోటీసు జారీ చేసిన ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ

నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని గేట్ నంబర్ వన్ వెలుపల నల్ల జెండాలతో అమిత్ షాకు స్వాగతం పలికారు. ముకుల్ రాయ్, బాబుల్ సుప్రియోలతో సహా బిజెపి సీనియర్ నాయకులు షాను స్వాగతించారు. అమిత్ షా రాక సంధర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనేక ఇతర నిరసన ర్యాలీలు మరియు సమావేశాలు జరుగుతున్నాయి.

ఢిల్లీ హింసలో రక్తాన్ని పారించిన అమిత్ షా, అల్లర్లు జరిగిన వెంటనే కోల్‌కతాకు రావడానికి ధైర్యం చేయడం మాకు సిగ్గుచేటు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అతని కోసం రెడ్ కార్పెట్ వేసుకుని ఉండవచ్చు, కాని యువకులు, విద్యార్థులు, వామపక్ష కార్మికులు మరియు ప్రజాస్వామ్యం ఇష్టపడే ప్రజలు ఆయనకు నల్ల జెండాలు చూపిస్తారు, '' అని CPI-M lawmaker చక్రవర్తి అన్నారు.

నగరంలో తొమ్మిది పాయింట్ల వద్ద నిరసనలు జరుగుతున్నాయని వామపక్ష నాయకుడు తెలిపారు. ఇదిలా ఉంటే అమిత్ షా రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఛత్తా పరిషత్, మహిలా కాంగ్రెస్ మరియు యువ కాంగ్రెస్ కూడా నిరసన ప్రదర్శనలను నిర్వహించాయి.