Guwahati, April 7: అస్సాంలోని (Assam) ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే మతాలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తుండటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఐపిసి సెక్షన్ 124-ఎ కింద దేశద్రోహ అభియోగం అతనిపై మోపబడిందని నివేదికలు తెలిపాయి. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక ఫ్రంట్ (AIUDF) పార్టీకి చెందిన అమీనుల్ ఇస్లాం (Assam MLA Aminul Islam) అనే ఎమ్మెల్యే మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా గుర్తించారు. అతను మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండటంతో విషయం పోలీసుల వరకూ వచ్చింది.
ఇస్లాంపై రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ -19 దిగ్బంధం కేంద్రాల వెనుక మతతత్వ కుట్ర ఉందని అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఆరోపించారు. దేశంలో కరోనావైరస్ వ్యాప్తిపై మరొక వ్యక్తితో సంభాషణ చేస్తున్న ఆడియో క్లిప్ వైరల్ అయింది.ఈ ఆడియో క్లిప్ లో (audio clip went viral) "చొరబాటుదారులను" ఉంచిన నిర్బంధ కేంద్రాల కంటే ఈ నిర్బంధ కేంద్రాలు (COVID-19 quarantine centres) అధ్వాన్నంగా ఉన్నాయని ఫోన్ ద్వారా ఆరోపించారు. రాష్ట్ర ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మహారాష్ట్రలో 891కి చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసులు
COVID-19 ముస్లిం బాధితులు ఆరోగ్యంగా ఉన్నారని, వారిని అనారోగ్యానికి గురిచేసేందుకు వైద్య సిబ్బంది ఇంజెక్షన్లు ఇస్తున్నారని AIUDF నాయకుడు చెప్పినట్లుగా ఆడియోలో వినవచ్చు. కొవిడ్ -19పేరుతో ముస్లింలను టార్గెట్ చేశారని, క్వారంటైన్ అని చెప్పి చంపేస్తున్నారని ఆడియో క్లిప్పులలో ఉందని పోలీసులు చెబుతున్నారు.
Assam MLA Charged With Sedition
#Assam MLA Aminul Islam, arrested for allegedly making communal remarks on #COVID19 quarantine centres, charged with sedition. #CoronavirusOutbreak #CoronavirisPandemic #AminulIslam pic.twitter.com/DKaFmq4JZ8
— NDTV (@ndtv) April 7, 2020
దీంతో నాగోవ్ జిల్లాలోని ధింగ్ ప్రాంతంలో ఇంట్లో ఉన్న ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ పూర్తి మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. మంగళవారం తర్వాత అతణ్ని కోర్టులో హాజరుపరచనున్నారు. అతనికి సంబంధించిన డిజిటల్ అకౌంట్లన్నింటీని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అతని మొబైల్లో చాలా క్లిప్పింగులను పోలీసులు గుర్తించారు. వీటిపై డిజిటల్ గా టెస్టులు నిర్వహిస్తారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ ప్రభుత్వం కొవిడ్-19 పేషెంట్లతో ప్రవర్తిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తున్నాడు. గత నెల ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కు కూడా ఆయన వెళ్లాడు.
కాగా అస్సాంలో ప్రస్తుతం 26కరోనా పాజిటివ్ కేసులు ( Coronavirus in Assam) ఉండగా, 25 జమాత్ కు సంబంధించినవే. తబ్లిగీ జమాత్ తర్వాత కరోనా కేసులు ఉన్నట్టుండి రెట్టింపు అయిపోయాయి. సోమవారం సాయంత్రానికి భారత్ లో 4వేల 67 కేసులు నమోదుకాగా, తబ్లిగీ జమాత్ కు సంబంధించినవి వెయ్యి 445ఉన్నాయి. 25వేల 500మంది పాల్గొన్న జమాత్ లో కేసులు ఇంకెన్ని బయటపడతాయో తేలాల్సి ఉంది.