Voting (Photo Credits: ANI)

Kolkata, Mar 28: పశ్చిమ బెంగాల్, అస్సాంలో శాసనసభ తొలి దశ ఎన్నికలు (Assembly Elections 2021) శనివారం జరిగాయి. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ (Polling for first phase ends in Assam, Bengal)జరగడం విశేషం. అసోంలో సాయంత్రం 6 గంటల సమయానికి 72.14 శాతం పోలింగ్ నమోదు కాగా, పశ్చిమబెంగాల్‌లో ఊహించని విధంగా 79.79 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించింది.

అసోంలో రెండు విడతల పోలింగ్‌లో భాగంగా తొలి విడతగా 47 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో తొలి విడతగా 30 స్థానాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 8 విడతలుగా బెంగాల్‌లో పోలింగ్ జరుగనుంది. కాగా, పశ్చిమబెంగాల్‌ తొలివిడత ఎన్నికల్లోనే భారీగా పోలింగ్ జరగడంతో పెరిగిన ఓట్ల శాతం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఎవరికి అనుకూలంగా ఉండబోతోందనే దానిపై చర్చ మొదలైంది. ఎక్కువ శాతం ఓట్లు పోల్ కావడం బీజేపీకి అనుకూలమని కొందరు విశ్లేషిస్తుండగా, అధికార తృణమూల్‌కు సానుకూల పవనాలు బలంగా వీస్తున్నాయనడానికి ఇది సంకేతమని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

రైతుల ఆగ్రహం, కొత్త చట్టాలకు మద్దతుగా మాట్లాడిన ఎమ్మెల్యేను గుడ్డలు ఊడదీసి తరిమికొట్టిన రైతులు, ఎమ్మెల్యే అరుణ్‌ నారంగ్‌‌పై దాడిని ఖండించిన సీఎం అమరీందర్ సింగ్, బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశాలు

ఎన్నికల సందర్భంగా కోవిడ్‌–19 నిబంధనలను పక్కాగా అమలు చేశారు. కొన్ని పోలింగ్‌ బూత్‌ల్లో ఓటర్లకు మాస్కులు, శానిటైజర్లు, పాలిథీన్‌ గ్లోవ్స్‌ అందజేశారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎం) మొరాయించిన ఘటనలు ఈసారి తక్కువగానే రికార్డయ్యాయని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సివిజిల్‌ యాప్‌ ద్వారా బెంగాల్‌లో 167, అస్సాంలో 582 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది.

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకు 2 రాష్ట్రాల్లో కలిపి రూ.281.28 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలియజేసింది. బెంగాల్‌లో 74 లక్షల మంది ఓటర్ల కోసం 10,288 పోలింగ్‌ కేంద్రాలు, అస్సాంలో 81 లక్షల మంది ఓటర్ల కోసం 11,537 పోలింగ్‌ కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. కరోనా నిబంధనల దృష్ట్యా ఈసారి పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను భారీగా పెంచారు.

తొలి దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో పలు ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పూర్బ మేదినీపూర్‌ జిల్లాలోని కాంతి దక్షిణ్‌లో ఈవీఎంలలో గోల్‌మాల్‌ జరుగుతోందని ఆరోపిస్తూ ఓటర్లు పోలింగ్‌ కేంద్రం ఎదుట ధర్నాకు దిగారు. ఇక మాజ్నా పట్టణంలో తాము ఒక పార్టీకి ఓటు వేస్తే మరోపార్టీకి వేసినట్లు వీవీప్యాట్‌ స్లిప్పులు వస్తున్నాయని జనం ఆగ్రహించారు. అధికారులు ఇక్కడ వీవీప్యాట్‌ యంత్రాన్ని మార్చారు.

బీజేపీ నేత తమ్ముడి కారుపై దాడి, సువేందు అధికారి సోద‌రుడైన సౌమెందు అధికారి కారును ధ్వంసం చేసిన దుండుగులు, తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కుడే దాడి చేయించాడ‌ని బీజేపీ నేత‌లు ఆరోపణ

కాంతిదక్షిణ్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు తన కారుపై దాడి చేశారని, డ్రైవర్‌ గాయపడ్డాడని బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు సౌమేందు ఆరోపించారు. దంతాన్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మోహన్‌పూర్‌లో తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో నలుగురు గాయపడ్డారు. ఒక పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి వెళ్తోందని ఆరోపిస్తూ పశ్చిమ మేదినీపూర్‌ జిల్లాలోని కేషియారీలో జనం బైఠాయించగా పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.

పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్‌ను ప్రతిపక్ష బీజేపీ శనివారం విడుదల చేసింది. నందిగ్రామ్‌కు చెందిన బీజేపీ నేత ప్రళయ్‌ పాల్‌తో ఆమె మాట్లాడినట్లు, మళ్లీ తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరాలని, తన గెలుపునకు సహకరించాలని అభ్యర్థిస్తున్నట్లుగా ఈ ఆడియోలో ఉండడం కలకలం రేపుతోంది. నందిగ్రామ్‌లో నేను నెగ్గడానికి సహకరించు. నీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు. ఇకపై నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా’’ అని మమత హామీ ఇవ్వగా, ప్రళయ్‌ పాల్‌ స్పందిస్తూ.. ‘‘దీదీ (అక్కా).. మీరు నాకు ఫోన్‌ చేశారు. అది చాలు. సువేందు అధికారికి ద్రోహం చేయలేను’ అని పేర్కొన్నాడు. ఈ ఆడియో విషయంలో ప్రళయ్‌ పాల్‌ మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం బీజేపీ కోసం పనిచేస్తున్నానని, ఆ పార్టీని మోసం చేయలేనని అన్నాడు.

బెంగాల్ కోట ఎవరిది? అస్సాంలో పాగా వేసేదెవరు, బెంగాల్‌లో 30, అస్సాంలో 47 స్థానాలకు తొలి దశలో ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం ఆరుగంటల వరకు ఓటింగ్

ఈ వీడియో ద్వారా మమతా బెనర్జీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌ వర్గీయా నేతృత్వంలో ఓ బృందం బెంగాల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ను కలిసింది. ఆడియో క్లిప్‌ను అందజేసింది

బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయ దాడులు జరిగాయి. ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ బీజేపీ కార్యకర్త హత్యకు గురవగా మరోచోట బీజేపీ నాయకుడు కారుపై దాడి జరిగింది. కారును ధ్వంసం చేయడంతో పాటు ఆ నాయకుడిపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాలోని కేశియారి ప్రాంతంలో బీజేపీ కార్యకర్త మంగల్‌ సోరెన్‌ (35) దారుణ హత్యకు గురయ్యాడు. పుర్బా మేదినిపూర్‌ జిల్లా సత్సతామల్‌ నియోజకవర్గంలో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద కాల్పులు కలకలం రేపాయి.

గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కొంటై నియోజకవర్గంలోని బీజేపీ సీనియర్‌ నాయకుడు సువేందు అధికారి సోదరుడు సౌమెందు అధికారి కారుపై దాడి జరిగింది. అతడి కారును అడ్డగించి ధ్వంసం చేశారు. కారు డ్రైవర్‌పై దాడి చేశారు. అయితే ఈ దాడి నుంచి సౌమెందు అధికారి సురక్షితంగా బయటపడ్డాడు.