Ayodhya verdict: Congress in favour of Ram Temple, doors closed for BJP to politicise issue now says Surjewala (Photo-ANI)

New Delhi, November 9: దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తున్న అయోధ్య భూవివాదం కేసు (Ayodhya Verdict)పై సుప్రీంకోర్టు (Supreme Court) తుది తీర్పును వెలువరించింది. ఈ సమయంలో అన్ని పార్టీలు ఈ తీర్పును స్వాగతిస్తున్నాయి. అలాగే తమదైన శైలిలో బీజేపీ మీద వ్యంగ్యాస్త్రాలను విసురుతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అయోధ్యలో వివాదస్పద స్థలంపై సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో రాజకీయ నాయకులు, పెద్దలు సంయమనం పాటించాలని లౌకికవాద విలువలను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా(Congress leader Randeep Surjewala) మాట్లాడుతూ.. అయోధ్య (Ayodhya)లో రామమందిర నిర్మాణానికి ( construction of Ram Temple) తాము అనుకూలమని తెలిపారు. ‘సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. మేము రామమందిర నిర్మాణానికి సానుకూలంగా ఉన్నాం. మందిర నిర్మాణానికి ఈ తీర్పు తలుపులు తెరవడమే కాదు.. అయోధ్య అంశాన్ని రాజకీయం చేసిన బీజేపీ, ఇతరులకు తలుపులు మూసేసిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా వ్యాఖ్యానించారు.

మీడియాతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి

కాగా అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సీడబ్ల్యూసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం ‘అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తోంది. లౌకిక విలువలకు కట్టుబడాలని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మతాల వారిని కోరుతున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ శాంతి, సౌభ్రాతృత్వాలను కలిగివుండాలని ఆకాంక్షిస్తున్నట్టు’ తెలిపింది. సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు వెలువరించినా అందరూ శాంతి సామరస్యాలతో ఉండాలని అంతకుముందు కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు