Elections for 13 Rajya Sabha Seats: 13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు, ఆరు రాష్ట్రాల నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2022తో ముగింపు
Parliament of India | File Photo

New Delhi, Mar 8: 13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు (Elections for 13 Rajya Sabha Seats) నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం మార్చి 7న ప్రకటించింది. ఆరు రాష్ట్రాల నుండి ఎన్నికైన 13 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2022లో పదవీ విరమణతో ముగియనుంది" అని ఎన్నికల సంఘం (Election Commission) ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 14న నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు మార్చి 21. మార్చి 22న నామినేషన్ల పరిశీలన, మార్చి 24లోగా అభ్యర్థుల విత్‌ డ్రాకు అవకాశం ఇచ్చారు.

మార్చి 31న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అనంతరం అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఏప్రిల్‌ 2కు ముందుగా 13 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. కాగా, 13 రాజ్యసభ స్థానాల్లో పంజాబ్‌ నుంచి ఐదు, కేరళ నుంచి మూడు, అస్సాం నుంచి రెండు, హిమాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, త్రిపుర నుంచి ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేయనున్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మళ్లీ బీజేపీ జెండా, అత్యధిక స్థానాలతో అధికారంలోకి వస్తుందని చెబుతున్న ఎగ్జిట్ పోల్స్

రాజ్యసభ సభ్యులు సుఖ్‌దేవ్ సింగ్, ప్రతాప్‌ సింగ్ బజ్వా, శ్వైత్ మాలిక్, నరేష్ గుజ్రాల్, షంషేర్ సింగ్ దుల్లో, ఏకే ఆంటోనీ, ఎంవీ శ్రేయామ్స్ కుమార్, కే సోమప్రసాద్, రాణీ నారా, రిపున్ బోరా, ఆనంద్ శర్మ, కేజీ కెన్యా, జర్నా దాస్ పదవీ కాలం ఏప్రిల్‌లో ముగుస్తుంది. రాష్ట్ర శాసనసభ్యుల దామాషా ప్రాతినిధ్య ఓట్ల ఆధారంగా రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు.