
Newdelhi, Nov 7: ఐదు రాష్ట్రాల ఎన్నికల (Five States Elections) సమరాంగణంలో నేడే తొలి పర్వం మొదలు కానున్నది. ఛత్తీస్ గడ్ అసెంబ్లీ ఎన్నికల (Chhattisgarh Polling Today) తొలి విడత పోలింగ్ నేడు (మంగళవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. నక్సల్స్ (Naxals) ప్రభావిత బస్తర్ జిల్లాలోని పలు ప్రాంతాలు సహా మొత్తం 20 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. ఓటింగ్ ప్రక్రియను రెండు టైమ్ స్లాట్స్‌గా విభజించారు. మొదటి స్లాట్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇక రెండో స్లాట్ లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలై మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. నక్సల్స్ ప్రభావితం ప్రాంతం కావడంతో పకడ్బందీ భద్రతా చర్యలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. తొలి దశ ఎన్నికల్లో బస్తర్, రాజ్‌నంద్‌గావ్ జిల్లాల నుంచి 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,078,681 మంది ఓటు హక్కును ఉపయోగించనున్నారు.
ముఖ్యులు వీళ్లే
మొదటి దశ పోలింగ్‌లో పలువురు ముఖ్యనేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్ గఢ్ చీఫ్, ఎంపీ దీపక్ బైజ్ (చిత్రకూట్), మంత్రులు కవాసీ లఖ్మా (కొంటా), మోహన్ మార్కం (కొండగావ్), మహ్మద్ అక్బర్ (కవార్ధా), ఛవీంద్ర కర్మతోపాటు పలువురు ముఖ్యనేతలు ఉన్నారు. బీజేపీకి చెందినవారిలో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మాజీ మంత్రులు లతా ఉసెండి (కొండగావ్ నియోజకవర్గం), విక్రమ్ ఉసెండి (అంతగఢ్), కేదార్ కశ్యప్ (నారాయణపూర్), మహేష్ గగ్డా (బీజాపూర్), మాజీ ఐఏఎస్ అధికారి నీలకంఠ్ టేకం (కేష్కల్) ముఖ్యమైన అభ్యర్థుల జాబితాలో ఉన్నారు.