Kolkata, Jan 31: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేది లేదని, రాష్ట్రంలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) కీలక ప్రకటన చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ ప్రకటనపై స్పందించారు. బీజేపీని బలోపేతం చేసేందుకే సీపీఎంతో కలిసి కాంగ్రెస్ పనిచేస్తోందని ఆరోపించారు. తాను ప్రతిపాదించిన రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతోనే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించామన్నారు.మూడున్నర దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన సీపీఎం పార్టీని తాను ఎన్నడూ క్షమించనని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి డబుల్ షాక్, ఒంటరిగానే బరిలోకి దిగుతామని తేల్చి చెప్పిన మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ
అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా వారికి రెండు లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. అయితే వాళ్లు మరిన్ని కావాలని అడగడంతో ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పానని సీఎం అన్నారు. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే సామర్థ్యం టీఎంసీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.7వేల కోట్లు రావాల్సి ఉందని ఫిబ్రవరి 1 నాటికి ఆ మొత్తం విడుదల చేయకుంటే పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నా చేస్తానని హెచ్చరించారు.ఫిబ్రవరి 2న చేసే ధర్నాలో అందరూ పాల్గొనాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.