Delhi CM Arvind Kejriwal (Photo Credit: X/ @ANI)

ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని (vote of confidence motion) ప్రవేశపెట్టారు. లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆరోసారి సమన్లు జారీ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఢిల్లీ కోర్టుకు కూడా హాజరుకావాల్సి ఉండటంతో అరెస్ట్ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని నిర్ణయించారు. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు, ఈ నెల 17న ఈడీ ముందు హాజరుకావాలని ఆదేశాలు, 5 సార్లు డుమ్మా కొట్టిన ముఖ్యమంత్రి

అసెంబ్లీలో దీనిపై ఢిల్లీ సీఎం (Delhi CM Arvind Kejriwal ) మాట్లాడుతూ.. బీజేపీ సభ్యులు ఆప్‌ ఎమ్మెల్యేలను సంప్రదించారని, ఢిల్లీ సీఎంను త్వరలో అరెస్ట్‌ చేస్తారని వారితో చెప్పారని అన్నారు. అలాగే 21 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు అంగీకరించారని, మరికొంత మంది బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు ఆప్‌ ఎమ్మెల్యేలతో చెప్పడంతోపాటు బీజేపీలో చేరేందుకు రూ.25 కోట్లు ఆఫర్‌ చేశారని ఆరోపించారు.బీజేపీ ఆఫర్‌కు తాము అంగీకరించలేదని ఇద్దరు ఆప్‌ ఎమ్మెల్యేలు తనకు చెప్పారని అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు.

Here's ANI News

ఢిల్లీలో ఎప్పటికీ ఎన్నికల్లో గెలువలేరని తెలుసు కాబట్టి ఇలాంటి కుట్రకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో తమ పార్టీకి అసెంబ్లీలో మెజార్టీ ఉన్నప్పటికీ, బీజేపీ ప్రయత్నాలను ఎండగట్టేందుకు విశ్వాస పరీక్షను (Vote of Confidence in Delhi Assembly) ఎదుర్కొంటామని అన్నారు.అయతే సభ రేపటికి వాయిదా పడింది. రేపు సభా కార్యక్రమాలు జరగనుండగా, ఈ తీర్మానంపై చర్చ జరగనుంది.