Benagaluru, November 13: కర్ణాటకలో 17 మంది రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ (Disqualified Karnataka MLAs' Case )పై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. వారిపై అనర్హత వేటు వేస్తూ జూలైలో నాటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే వీరంతా 2023 వరకు సభాకాలం ముగిసేదాకా (current assembly ends in 2023) ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ స్పీకర్ విధించిన నిషేధాన్ని కొట్టేసింది.
తాజాగా ఖాళీ అయిన స్థానాల్లో అసమ్మతి ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చేసేందుకు (Can Contest Bypolls) అనుమతించింది. ఎమ్మెల్యేలు పోటీ చేయడంపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేరని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో అసమ్మతి ఎమ్మెల్యేలకు సుప్రీంలో ఉపశమనం లభించినట్టైంది.
అనర్హత వేటు పడిన వారిలో కాంగ్రెస్ నుంచి 14 మంది, జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖాళీ అయిన 17 అసెంబ్లీ స్థానాల్లో 15 చోట్ల వచ్చే నెల 5న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 11 నుంచి 18 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలంతా తాజాగా బీజేపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
Disqualified Karnataka MLA, AH Vishwanath
Disqualified Karnataka MLA, AH Vishwanath on Supreme Court's judgement upholding the disqualification of MLAs but allowing them to contest by-elections in the state: I welcome the judgement of the Supreme Court. We should be happy because the apex court has awarded a judgement. pic.twitter.com/gaxp6r5QZL
— ANI (@ANI) November 13, 2019
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మెజారిటీ నిలబెట్టుకోవాలంటే కనీసం ఆరు చోట్ల విజయం సాధించాల్సి ఉంటుంది. 2018లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ ఇవలేదు. కర్ణాటకలో పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అడుగు దూరంలో ఆగిపోయింది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సరిగ్గా 13 నెలల తరువాత కర్ణాటకలో 17 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
రాజీనామాను కర్ణాటక స్పీకర్ అంగీకరిస్తూనే.. వారిపై అనర్హత వేటు వేసింది. 13 అసెంబ్లీ పూర్తయ్యే వరకు వారు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా అనర్హత వేటు వేసింది. ఈ కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది.