Election Results 2024 LIVE Updates: హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.హరియాణా (Haryana)లో ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో జోరు ప్రదర్శించగా.. ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది. దీంతో రెండు పార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. అటు జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకెళ్తోంది.
హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 34 స్థానాల్లో ముందంజలో ఉందని తాజా ట్రెండ్‌లు తెలియజేస్తున్నాయి. వివిధ ఎగ్జిట్ పోల్స్ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని అంచనా వేసింది. అయితే ఆ అంచనాలు తప్పినట్లుగా ఎన్నికల ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం.
జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పటివరకు బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) ఒక్కో సీటు గెలుచుకున్నాయి . కాంగ్రెస్ అభ్యర్థి చౌదరి లాల్ సింగ్‌పై బసోలి నుంచి బీజేపీ అభ్యర్థి దర్శన్ కుమార్ 16,000 ఓట్లకు పైగా గెలుపొందగా, ఎన్‌సీ అభ్యర్థి నజీర్ అహ్మద్ ఖాన్ గురేజ్ (ఎస్టీ) నుంచి 1,132 ఓట్ల తేడాతో గెలుపొందారు. అందుబాటులో ఉన్న లీడ్‌ల ప్రకారం, 90 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్, NC కూటమి ప్రస్తుతం 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, ఇది మెజారిటీ మార్క్ (46) కంటే ఎక్కువగా ఉంది. మరోవైపు బీజేపీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ.. క్షణక్షణానికి మారుతున్న ఫలితాల సరళి (లైవ్)
జమ్మూ మరియు కాశ్మీర్ 2014 తర్వాత మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసింది, మొదట కేంద్ర పాలిత ప్రాంతంగా మరియు ఆర్టికల్ 370 తొలగించబడిన తర్వాత, ఇది రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ హంగ్ హౌస్ అని అంచనా వేసిన J&Kలో కీలక పాత్ర పోషించగల ఇతర పార్టీలు పీపుల్స్ కాన్ఫరెన్స్, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ మరియు అప్నీ పార్టీలు పోటీలో ఉన్నాయి.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడం మొదలైన కొద్దిసేపటికి లీడ్స్ పూర్తిగా కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. తొలి రౌండ్ల లీడ్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా మ్యాజిక్‌ఫిగర్ మార్కు 46ను కూడా దాటేసింది. ఇంకేముంది ఎగ్జిట్‌పోల్స్ చెప్పినట్లుగా కాంగ్రెస్‌దే ఈసారి హరియాణా పీఠమని అంతా అనుకున్నారు. అటు హరియాణా, ఇటు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ శ్రేణులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నాయి. కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరని టీవీ ఛానళ్లు కథనాలు కూడా వేయడం మొదలుపెట్టాయి. ఇంతలోనే వచ్చింది అసలు ట్విస్టు.
ఒక్కసారి ఫలితాల ట్రెండ్స్ తలకిందులయ్యాయి. హస్తాన్ని వెనక్కినెట్టి కమలం జెట్ స్పీడుతో ఆధిక్యంలోకి దూసుకువచ్చింది.కాంగ్రెస్‌ను కేవలం 30పైచిలుకు సీట్లకే పరిమితం చేసి బీజేపీ మ్యాజిక్‌ఫిగర్ మార్కు 46ను అవలీలగా దాటింది. ఈ ట్రెండ్‌ను బీజేపీ కొనసాగిస్తోంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంస్థలతో పాటు రాజకీయ పండితులంతా తలలుపట్టుకున్నారు.
సంబరాలు జరుపుకోవడం ఈసారి కమలనాథుల వంతైంది. ఎగ్జిట్‌పోల్స్‌కు అందని ఫలితాలు సాధిస్తామని తాము ముందే చెప్పిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.జాట్‌లలో పట్టు నిలుపుకోవడం బీజేపీకి కలిసొచ్చిందని, కురుక్షేత్ర ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్‌కు ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది.కాగా, మరోపక్క జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉండగా బీజేపీ ఇక్కడ కూడా గట్టిపోటీ ఇచ్చింది.