Lahore, December 17: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు (former president Pervez Musharraf) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముషారఫ్‌కు(Pervez Musharraf) పాకిస్థాన్ (Pakistan)లోని పెషావర్ హైకోర్టు ( Peshawar High Court) ఉరిశిక్షను విధించింది. దేశద్రోహం కేసులో ఆయనను దోషిగా తేల్చిన హైకోర్టు... మరణదండనే (Death Penalty) ఆయనకు తగిన శిక్ష అని తేల్చింది. నాలుగేళ్ల నుంచి ముషారఫ్ దుబాయ్ లో తలదాచుకుంటున్నారు.
దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో దేశద్రోహం కేసు నమోదయిన విషయం తెలిసిందే. ముషారఫ్‌పై నమోదైన కేసులను సుదీర్ఘంగా విచారించిన ముగ్గురు న్యాయమూర్తలు ధర్మాసనం మంగళవారం ఆయన్ని దోషిగా తేల్చుతూ.. తీర్పును వెలువరించింది. కాగా దేశ అధ్యక్షుడిగా ఉరిశిక్షను విధించడం పాకిస్తాన్ దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
ANI Tweet:
A special court hands death penalty to former Pakistani military dictator Pervez Musharraf in high treason case: Pakistan Media (file pic) pic.twitter.com/8V3j7uAyZI
— ANI (@ANI) December 17, 2019
పర్వేజ్ ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే రాజ్యాంగానికి వ్యతిరేంగా 2007నవంబర్3న దేశంలో ఎమర్జెనీ విధించారు. ఏకంగా దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గృహ నిర్బంధం విధించి.. చాలామంది న్యాయమూర్తులను విధుల నుంచి తప్పించారు. అక్కడితో ఆగని ముషారఫ్.. మీడియాపై ఆంక్షలు విధించడంతో.. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది.తర్వాత ఆయనపై 2013లో దేశద్రోహం కేసు నమోదైంది.
అప్పటి నుంచి ఈ కేసులో విచారణ జరుగుతోంది.2016లో వైద్యం పేరుతో ముషారఫ్ దుబాయ్ వెళ్లిపోయి అక్కడే తలదాచుకుంటున్నాడు. తర్వాత కోర్టు సమన్లు పంపించినా ఆయన స్పందించలేదు.. కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆయన్ను అరెస్ట్ చేయాలని ఎఫ్‌ఐను ఆదేశించింది. ఈ కేసులో విచారణ చేపట్టిన స్పెషల్ కోర్టు నవంబరు 19న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఇప్పుడు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ముషారఫ్‌ను పాక్‌కు తీసుకువచ్చి ఉరి తీయడం అనేది ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. మరోవైపు లాహోర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.