Gourav Vallabh Resigns: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గౌరవ్ వల్లభ్ పార్టీకి రాజీనామా చేశారు. తాను సనాతన ధర్యానికి వ్యతిరేక నినాదాలు చేయలేనని, ఇకపై పార్టీలో కొనసాగలేనని ప్రకటించారు. గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తాను పంపిన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నేను కాంగ్రెస్‌లో చేరినప్పుడు దేశంలోనే ఘన చరిత్ర కలిగిన పార్టీ అని నమ్మాను. యువకులకు, మేధావుల ఆలోచనలకు విలువ ఇస్తారని భావించాను. అయోధ్యలోని నూతన రామాలయం విషయంలో కాంగ్రెస్ వైఖరికి నేను కలత చెందాను. నేను పుట్టుకతో హిందువును. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. ఇండియా కూటమితో సంబంధం కలిగిన పలువురు నేతలు సనాతనానికి వ్యతిరేకంగా మాట్లాడటం నాకు నచ్చలేదని’ ఆ లేఖలో గౌరవ్ వల్లభ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్, వీడియో ఇదిగో..
పార్టీ క్షేత్రస్థాయిలో బాగా దెబ్బతిందని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కార్యకర్తలకు నాయకులకు మధ్య గ్యాప్‌ను పూరించడం కష్టంగా మారిందన్నారు. కిందిస్థాయిలోని వారు తమ నాయకులకు నేరుగా సలహాలు ఇవ్వలేనప్పుడు ఎటువంటి సానుకూల మార్పు సాధ్యంకాదని తెలిపారు. గౌరవ్ 2023లో రాజస్థాన్ నుంచి ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు.
Here's Gourav Vallabh Resigns Letter
कांग्रेस पार्टी आज जिस प्रकार से दिशाहीन होकर आगे बढ़ रही है,उसमें मैं ख़ुद को सहज महसूस नहीं कर पा रहा.मैं ना तो सनातन विरोधी नारे लगा सकता हूं और ना ही सुबह-शाम देश के वेल्थ क्रिएटर्स को गाली दे सकता.इसलिए मैं कांग्रेस पार्टी के सभी पदों व प्राथमिक सदस्यता से इस्तीफ़ा दे रहाहूं pic.twitter.com/Xp9nFO80I6
— Prof. Gourav Vallabh (@GouravVallabh) April 4, 2024
ఇక మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్) వర్గంతో సీట్ల సర్దుబాటుపై అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేత సంజయ్ నిరుపమ్‌పై కాంగ్రెస్ పార్టీ నిన్న రాత్రి ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ పార్టీకి రాజీనామా లేఖను పంపిన తర్వాతే చర్యలు తీసుకొన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖ ఈమెయిల్ కాపీ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు.
సంజయ్ గతంలో ఉత్తర ముంబయి నుంచి ఎంపీగా గెలిచారు. ఈ స్థానానికి శివసేన (ఉద్ధవ్) వర్గం అభ్యర్థిని ప్రకటించడంతో ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌పై విమర్శలు మొదలుపెట్టారు. ముంబయిలో ఆ పార్టీ చర్యలను ఆమోదిస్తూ పోతే.. కాంగ్రెస్ దెబ్బతింటుందని హెచ్చరించారు. మరో వైపు హస్తం పార్టీ కూడా సంజయ్ పేరును స్టార్ ప్రచారకుల జాబితా నుంచి తొలగించింది.