Ahmedabad, May 18: గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పాటీదర్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాజీనామా (Hardik Patel Resigns) చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా (Hardik Patel Resigns from Congress) చేస్తున్నట్లు ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను షేర్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నాను. తన నిర్ణయాన్ని నా సహచరులు గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారనని నమ్ముతున్నాను. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం ద్వారా భవిష్యత్తులో గుజరాత్ కోసం సానుకూలంగా పనిచేయగలనని విశ్వసిస్తున్నానని ట్విటర్‌లో రాసుకొచ్చారు.
మరి కొద్ది నెలల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో చేయడం కాంగ్రెస్‌కు పార్టీ ఆత్మరక్షణలో పడింది. అంతేగాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హార్దిక్ పటేల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతానే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గుజరాత్‌లో పార్టీ పరిస్థితిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరిస్తూ సుధీర్ఘ లేఖ రాశారు. ఇందులో చాలాకాలంగా కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై ఆగ్రహంగా ఉన్న హార్దిక్ గుజరాత్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు.
రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు, దోషి ఎ.జి.పేరరివాళన్‌ను విడుదల చేయాలని ఆదేశాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుజరాత్ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులకు సేవలు చేయడంలో మునిగిపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను సరైన దిశలో ముందుకు నడిపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆ పార్టీ ఎల్లప్పుడూ దేశ, సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. కాగా గుజరాత్‌లోని పాటీదార్ ఆందోళన ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిన హార్దిక్ పటేల్‌కు తగిన గౌరవం లభించని కారణంగా పార్టీని వీడినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.