 
                                                                 Hyderabad, November 22: తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) నేత, వేములవాడ (Vemulawada Constituency) ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (Chennamaneni Ramesh) కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని భారతీయ పౌరసత్వాన్ని (Citizenship) రద్దు చేస్తూ కేంద్రం విడుదల చేసిన ప్రకటనపై హైకోర్ట్ శుక్రవారం స్టే ఇచ్చింది.కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను 4 వారాల పాటు నిలిపివేస్తూ హైకోర్ట్ (High Court) మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది.
రమేష్ పౌరసత్వ అంశం 2009 నుంచి పెండింగ్‌లో ఉంది, 2009లో తొలిసారిగా వేములవాడ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు, అయితే ఆయన టీడీపీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసీ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2010 ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తిరిగి ఎన్నికయ్యారు. మళ్ళీ 2014, 2018 ఎన్నికల్లో కూడా రమేశ్ వరుసగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే 2009 ఎన్నికల గెలిచిన దగ్గరి నాటి నుంచే చెన్నమనేని భారతీయ సభ్యత్వంపై ఆయన రాజకీయ ప్రత్యర్థులు న్యాయపోరాటం చేస్తున్నారు. చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని చెపుతూ, చెన్నమనేని పూర్వాపరాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్ట్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో చెన్నమనేని అంశం పలు పర్యాయాలు కేంద్రం, కోర్టుల చుట్టూ తిరుగుతూ వచ్చింది. చివరకి ఈనెల 20న చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ ప్రకటిస్తూ, అధికారికంగా ఉత్తర్వులు వెలువరించింది.
దీంతో చెన్నమనేని రమేశ్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైకోర్ట్ సూచించిన మార్గదర్శకాలు పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా తన పౌరసత్వాన్ని రద్దు చేసిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్ట్ కేంద్ర ప్రకటనపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
