Jammu and Kashmir assembly elections Phase 1 polling updates

Hyd, Sep 18:  పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం ఏడు గంటలకే తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుండగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు.

జమ్ము కశ్మీర్‌లో మొత్తం 94 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతలో 24 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 23 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగింకోనుండగా విజయం ఎవరిని వరిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిజెపి, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటికి పార్టీలతో జతకట్టగా నేషనల్ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్ కూటమిగా బరిలోకి దిగింది. జత కట్టి బరిలోకి దిగింది. జమ్ము కశ్మీర్ ఎన్నికలు మూడ విడుతలలో జరగనున్నాయి.    జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్‌, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత తొలిసారి ఎన్నికలు

Here's Video:

 మొత్తం 3,276 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 14,000 మంది పోలింగ్ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మిర్, సీపీఎం నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి, నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్ర కార్యదర్వి సకినా ఇటూ, పీడీపీకి చెందిన సర్తాజ్ మద్నీ అబ్దుల్ రెహ్మాన్ తొలి విడత ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖుల్లో ఉన్నారు.

ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్‌లో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇది. మొదటి దశ ఎన్నికల్లో 35,000 మంది కాశ్మీరీ పండిట్లు ఓటు వేయనున్నారు.

Here's Video: