Bengaluru, May 13: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) సంబంధించి కౌంటింగ్ (Counting) మొదలైంది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ (Polling) జరగగా.. నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ అయ్యింది. ఎర్లీ ట్రెండ్స్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యతను కనబరుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకే ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి స్పష్టమైన మెజార్టీ దిశగా ముందుకు సాగుతోంది. మొత్తం 224 స్థానాలకు గాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 స్థానాల మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 114 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 76 స్థానాల్లో, జేడీఎస్ 29 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
ముఖచిత్రం ఇది
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి కలిపి మొత్తం 2,615 మంది క్యాండిడేట్లు బరిలో నిలిచారు. రికార్డ్ స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల్లో ప్రధానంగా రూలింగ్ పార్టీ బీజేపీ, అపొజిషన్ పార్టీ కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య టైట్ పోటీ ఉండగా, హంగ్ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టం చేశాయి.అయితే, కర్ణాటకలో గత 38 ఏండ్లుగా ఓటర్లు ప్రతిసారీ అధికార పార్టీని మారుస్తూ వచ్చారు. ఈ సారి మాత్రం తమను మార్చబోరని, మళ్లీ తమకే పట్టం కడతారని బీజేపీ ధీమాతో ఉండగా, ఆనవాయితీ ప్రకారం తమకే అధికారం దక్కుతుందని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ భావిస్తోంది. జేడీఎస్ మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కింగ్ మేకర్ అవ్వొచ్చన్న ఆశతో ఎదురుచూస్తున్నది.