Kerala December 16: మెట్రోమ్యాన్ శ్రీధరన్(Metro Man Sreedharan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బీజేపీ(BJP)లో ఉన్న ఆయన....రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తనకు తత్వం బోధపడిందని, ఎన్నికల బరిలోకి దిగి… గుణపాఠం నేర్చుకున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలప్పురం ప్రెస్ మీట్ పెట్టి తన నిర్ణయాన్ని ప్రకటించారు శ్రీధరన్(Sreedharan). తాను నేతాగిరీ ఎన్నడూ చేయలేదని, రాజకీయ నేతగా ఎన్నడూ లేనన్నారు. ”ప్రస్తుతం నాకు 90 ఏళ్లు. ఇంకా రాజకీయాల్లో ఉండడం(active politics), రాజకీయాలను కెరీర్‌గా కొనసాగిస్తే చాలా ప్రమాదం. రాజకీయాలను చేయడం నా కల కూడా కాదు” అని శ్రీధరన్ స్పష్టం చేశారు.
మెట్రో మ్యాన్(Metro Man Sreedharan) గా ఉంటూ అందరికీ చిర పరిచితులైన శ్రీధరన్ కేరళ ఎన్నికల(Kerala Elections) సమయంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టీ ఆయనపైనే పడింది. ప్రజల నుంచి స్పందన కూడా అద్భుతంగా వచ్చింది. అంతేకాకుండా పాలక్కడ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి కూడా దిగారు. పాలక్కడ్(Palakkad)లోనే ఇల్లు అద్దెకు తీసుకుంటానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని, లవ్ జిహాద్‌ను అడ్డుకుంటానని కూడా శ్రీధరన్ హామీ ఇచ్చారు. సీఎం పదవి కూడా చేపట్టేందుకు రెడీ అని ప్రకటించారు.
కానీ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చవిచూసింది. గతంలో ఉన్న ఒక్క సీటు కూడా కోల్పోయింది. అప్పటి నుంచి శ్రీధరన్ యాక్టీవ్ పాలిటిక్స్(Active politics) కు దూరంగా ఉంటున్నారు. గురవారం నాడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. పాలక్కడ్‌లో ప్రత్యర్థులకు గట్టి పోటీనే ఇచ్చిన శ్రీధరన్…. ఓటమి పాలయ్యారు. తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ విజయం సాధించారు.