File image of Elattuvalapil Sreedharan (Photo Credits: PTI)

Thiruvananthapuram , March 4: కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని గురువారం ప్రకటించింది. మెట్రో శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేంద్రన్ అధికారికంగా ప్రకటించారు. టెక్నోక్రాట్, మెట్రో‌మ్యాన్ శ్రీధరన్ ఇటీవలే బీజేపీలో అధికారికంగా చేరారు. బీజేపీలో చేరక మునుపే తనకు సీఎం అభ్యర్థిగా (E Sreedharan Announced BJP CM Candidate) బరిలోకి దిగడం సమ్మతమేనని ప్రకటించారు.

మరోవైపు గురువారంతో తాను పదవీ విరమణ చేస్తానని, ఆ తర్వాతే ఎన్నికల (Kerala assembly Elections) ప్రచారంలో పాల్గొంటానని ఆయన ప్రకటించారు. శ్రీధరన్‌కున్న క్లీన్ ఇమేజ్ బాగా కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. ‘ఈ వేషధారణలో ఉండడం ఇదే చివరి రోజు. ఇది ఢిల్లీ మెట్రో రైల్ యూనిఫాం. ఇదో విలక్షణమైన యూనిఫాం.’’ అని శ్రీధరన్ తెలిపారు.

ఇదిలా ఉంటే కేరళలో ఎన్నికల సమయంలో (Kerala Assembly Elections 2021) బీజేపీ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో తమను గెలిపిస్తే.. లీటర్‌ పెట్రోల్‌ 60 రూపాయలకే అందిస్తామని కేరళ బీజేపీ లీడర్ కుమ్మనం రాజశేఖరన్ ప్రచారం చేస్తున్నారు. అందులోనే జీఎస్టీ లాంటి ట్యాక్సులన్నీ లోబడే ఉంటాయని అంటున్నారు. పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీలోకి చేరుస్తామని హామీ ఇచ్చేశారు. ఎన్నికల సందర్భంగా కొచ్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజశేఖరన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో బీజేపీకి ఘోర పరాభవం, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ వార్డుల్లో నాలుగు ఆప్ కైవసం, ఒకటి కాంగ్రెస్ ఖాతాలోకి, 15 ఏళ్లుగా ఎంసీడీని పాలించిన బీజేపీకి ఒక్క సీటు కూడా రాని వైనం

అంతేకాకుండా ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ని జీఎస్టీ ఫ్రేమ్‌లో ఎందుకు చేర్చలేదని రాజశేఖరన్‌ ప్రశ్నించారు. ఇది జాతీయ అంశం. దీన్ని లీడ్ చేయడానికి కొన్ని కారణమవుతున్నాయని ఆయన తెలిపారు. వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది అన్నారు. దీనిని ఎందుకు జీఎస్టీ కిందకు తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో కేరళలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే.. లీటర్‌ పెట్రోల్‌ 60 రూపాయలకే అందిస్తామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని లెక్కించిన తర్వాత తనకు ఇది అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు.

రాజస్తాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రల్లో అత్యధిక వ్యాట్ కారణంగా ఇప్పటికే లీటర్‌ పెట్రోల్‌ ధర 100 రూపాయల మార్కును దాటేసింది. ఇంధన ధరలు ఇంత భారీగా పెంచడం పట్ల ప్రతిపక్షాలు.. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాయి.