Bhopal, Dec 11: భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి పేరు ఖరారు అయింది.ఉజ్జెయినీ సౌత్ నుంచి గెలిచిన మోహన్ యాదవ్ ను సీఎంగా బీజీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. తాజా ఎన్నికల్లో దక్షిణ ఉజ్జయిని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2013లో తొలిసారిగా ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2018లో మళ్లీ అదే అసెంబ్లీ స్థానంలో గెలుపొందారు. ఇక ఉప ముఖ్యమంత్రులుగా (MP New Deputy CM and Speaker) జగదీష్ దేవ్డా, రాజేశ్ శుక్లాలు ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా నరేంద్రసింగ్ తోమర్‌ను ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఖరారు చేసిన బీజేపీ పెద్దలు
మోహన్ యాదవ్ 25 మార్చి 1965లో ఉజ్జయినిలో జన్మించారు. గతంలో శివరాజ్‌సింగ్ చౌహాన్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.నవంబర్ 17 ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారాన్ని నిలుపుకుంది, 230 సభ్యుల అసెంబ్లీలో 163 స్థానాలను గెలుచుకుంది, కాంగ్రెస్ 66 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎంలుగా జగదీష్ దేవ్డా, రాజేశ్ శుక్లాలు, అసెంబ్లీ స్పీకర్‌గా నరేంద్రసింగ్ తోమర్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపిక కోసం అంతకుముందు బీజేపీ హైకమాండ్ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ నాయకుడు డాక్టర్ కే లక్ష్మణ్, ఆశా లక్రాలతో కేంద్ర పరిశీలకులుగా నియమించింది. ఈ పరిశీల సమక్షంలోనే కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా మోహన్‌యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.