Nana Patole elected Maharashtra Assembly Speaker | (Photo Credits: ANI)

Mumbai, December 1: మహారాష్ట్ర అసెంబ్లీ  స్పీకర్‌గా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నానా పటోలే ( Maharashtra assembly speaker Nana Patole)బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే(Maharashtra chief minister Uddhav Thackeray), ప్రతిపక్ష నేత దేవేంద్ర(Devendra Fadnavis) ఫడ్నవీస్​.. పటోలేను సభాపతి స్థానంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. స్పీకర్​ రేసు నుంచి బీజేపీ తప్పుకోవడంతో పటోలే ఎన్నిక ఏకగ్రీవం అయింది. స్పీకర్ ఎన్నికకు ముందే ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్సే (pro-tem Speaker Dilip Walse Patil of the NCP)అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ప్రతిపక్ష నేత ఫడ్నవీస్ ఇతర పక్షాల నేతలు హాజరయ్యారు.

స్పీకర్​ ఎన్నిక జరిగే కొద్ది గంటల ముందు బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్పీకర్​ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. స్పీకర్ ​ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం సంప్రదాయంగా వస్తున్న క్రమంలో పోటీ నుంచి తప్పుకోవాలని అఖిల పక్ష పార్టీలో నేతలు సూచించినట్లు మాజీ సీఎం ఫడ్నవీస్​ తెలిపారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు.

ఏకగ్రీవ ఎన్నిక

56ఏండ్ల పటోలే కాంగ్రెస్‌ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. విదర్భ ప్రాంతంలోని సకోలీ నియోజకవర్గం(Sakoli constituency) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ రైతు విభాగానికి పటోలే అధ్యక్షుడిగా పనిచేశారు. విదర్భ ప్రాంతంలో రైతు సమస్యల పట్ల పటోలే చాలా పోరాటాలు చేశారు.

మొదటి దఫాలో ఏర్పడ్డ మోడీ (Prime Minister Narendra Modi)సారథ్యంలోని ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన మొదటి నేతగా నానా పటోలేకు పేరుంది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలకు( 2019 Lok Sabha elections) ముందు బీజేపీ తిరుగుబాటు నేతగా ఆ పార్టీని వదిలిపెట్టిన పటోలె ఆ వెంటనే కాంగ్రెస్‌లో చేరారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి(BJP veteran Nitin Gadkari)పై పోటీ చేసి ఓడిపోయారు.

స్పీకర్‌గా పటోలే ఎన్నికపై శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే హర్షం వ్యక్తం చేశారు. రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పటోలే అందరినీ సంతృప్తి పరిచేలా వ్యవహరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ANI Tweet

మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. పటోలేకి వ్యవసాయ శాఖ మంత్రి పదవి దక్కుతుందని భావించానన్నారు. ఏ పదవి చేపట్టినా సరే.. ఆ పదవి ద్వారా రైతులకు సాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.బీజేపీ తరపున కిషన్ కథోర్‌ని స్పీకర్ అభ్యర్థిగా నామినేట్ చేశామని కానీ అఖిలపక్ష భేటీలో అభ్యంతరాల మేరకు అభ్యర్థిని తొలగించామని చెప్పారు. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేయాలన్న ఆనవాయితీని కొనసాగించడానికి సహకరించామన్నారు.‌

ఒక శాసనసభ్యుడిగా, రైతుల నాయకుడిగా పటోలే పని చేయాలని ఫడ్నవీస్‌ కోరారు. రైతులను ఆదుకునేందుకు 25 వేల రూపాయలను ప్రభుత్వం ఇవ్వాలని ఫఢ్నవీస్ డిమాండ్ చేశారు.దేవేంద్ర ఫడ్నవీస్‌, ప్రతిపక్ష నేత కాంగ్రెస్‌ నుంచి నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికైన నానా పటోలే, విదర్భ ప్రాంతంలో రైతు సమస్యలపై అనేక ఆందోళనలు చేశారు.