Mumbai, October 24: ఎన్నికల కమిషన్ అధికారుల నుంచి అందిన అనధికార సమాచారం ప్రకారం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి ముందంజలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీ కూటమి 130 స్థానాల్లో ముందంజలో ఉంది. యూపీఏ కూటమి 46 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ ముందుగా ఊహించినట్టుగానే బీజేపీ, శివసేన కూటమి దూసుకెళుతోంది. మరోవైపు హరియాణాలోనూ ఇదే తరహా ఫలితం కనిపిస్తోంది. 90 నియోజకవర్గాలున్న హరియాణాలో ఆరు చోట్ల తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసింది. బీజేపీ 5 చోట్ల, కాంగ్రెస్ ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. మరోవైపు విజయంపై ధీమాతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి.మొత్తం 288 స్ధానాలకు మహారాష్ట్రలో పోటీ జరుగుతోంది.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. నాగపూర్ సౌత్‌వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి లీడింగ్‌లో ఉన్నారు.వర్లీ సీటు నుంచి ఆదిత్య థాకరే .. ఆధిక్యంలో ఉన్నారు.బారామతి స్థానం నుంచి అజిత్ పవార్ ముందంజలో ఉన్నారు.