Maharashtra Elections Eknath Shinde Key Comments on CM Post(X)

Hyd, Nov 23:  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిని మట్టికరిపిస్తూ ఎన్డీయే కూటమి మహాయుతి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్, శరద్ పావ్, ఉద్దవ్ ఠాక్రేలకు ఘోర పరాజయం ఎదురుకాగా ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు సీఎం ఏక్‌నాథ్ షిండే. అయితే సీఎం పదవిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని...సీట్లకు, సీఎం పదవికి సంబంధం లేదు అన్నారు. సీఎం పదవిపై అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని...పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత స్పందిస్తానని చెప్పారు.

మహాయుతిలో 120కిపైగా స్థానాల్లో విజయాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. దీంతో సీఎం పదవి బీజేపీకే దక్కుతుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో కీలక కామెంట్స్ చేశారు షిండే. అందరం కూర్చుని సీఎం పదవిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.  ఇది ప్రజా తీర్పు కాదు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారన్న శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ప్రజలు ఈ తీర్పును అంగీకరించని కామెంట్ 

Here's Tweet:

కూటమి విజయానికి సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా నిలిచాయని ...ఇది ట్రైలర్ మాత్రమే. ముందుంది సినిమా అన్నారు. గతంలో తాను ఒక ఆపరేషన్ చేశానని, కుట్లు కూడా వేయకుండా ఆపరేషన్ జరిపానని తెలిపారు. నేను డాక్టర్‌ను కాను... అయినా ఏడాదిన్నర క్రితం ఒక ఆపరేషన్ చేశాను... కుట్లు వేయకుండానే ఆపరేషన్ జరిగిందన్నారు. అంతకంటే ఏమీ చెప్పలేను. ఇది ట్రయిలర్ మాత్రమే, ఫిల్మ్ ఇంకా రావాల్సి ఉంది అని సీఎం నవ్వుతూ వ్యాఖ్యానించారు.