Bihar, Aug 5: అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పార్టీ విధివిదానాలను ప్రకటించనున్నారు ప్రశాంత్. గతంలో నితీశ్ కుమార్‌తో జేడీయూలో పనిచేసి తర్వాత బయటికొచ్చిన ప్రశాంత్...ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు.
తాజాగా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు ప్రశాంత్ కిషోర్. తమ రాష్ట్రానికి పదవ తరగతి ఫెయిల్ అయిన నాయకత్వం అవసరమే లేదని చురకలు అంటించారు. చాలా మంది రాజకీయాలలోకి రావాలంటే కోట్లు ఖర్చుపెట్టాలని అనుకుంటున్నారని కానీ తాను వచ్చాక అవేమి అవసరం లేదని తేల్చిచెబుతున్నారు.
జన్ సురాజ్ పార్టీ ఆదర్శ భావాలు కలిగిన యువకుల కోసమేనని, రాజకీయ వ్యవస్థలోనే సరికొత్త ఒరవడి క్రియేట్ చేస్తామని చెప్పారు. నేటి యువకులు రాజకీయాల పట్ల శ్రద్ధ వహించడం లేదని.. యువత తప్పనిసరిగా రాజకీయాలలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అన్ని రాజకీయ పార్టీల మాదిరిగా తమ పార్టీ ఉండదని, కనీస విద్యార్హతలు ఉన్న వారికే పార్టీలో ప్రాతినిధ్యం కల్పిస్తామని అంటున్నారు. బీహార్‌లో దారుణం, తాగిన మత్తులో కారులోకి బాలికను లాగి అత్యాచారం చేయబోయిన పోలీస్ అధికారి, బాలిక సహాయం కోసం అరవడంతో..
2014 నుండి దేశంలో వినిపిస్తున్న పేరు ప్రశాంత్ కిషోర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2019లో జగన్, తర్వాత మమతా బెనర్జీలకు అధికారాన్ని కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో జగన్‌కు ఘోర పరాభవం తప్పదని చెప్పినట్లుగానే వైసీపీ ఓటమి పాలైంది. మమతా బెనర్జీ సీఎంను చేసి ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్త పదవి నుండి తప్పుకున్నారు.