'Need Solution': అనవసర ప్రసంగాలు వద్దూ.. పరిష్కారం చూపండి! ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు; ఒకే దేశం - ఒకే పన్ను అన్న మోదీ, వ్యాక్సిన్ కూడా ఒకే ధరకు ఎందుకివ్వరు? అని ప్రశ్నించిన టీఎస్ మంత్రి కేటీఆర్
Narendra-Modi-Rahul-Gandhi | File Photo

New Delhi, April 22: గతం ఎన్నడూ లేనంతగా దేశంలో సెకండ్ వేవ్ కోవిడ్ విజృంభిస్తోంది. భారత్‌లో కోవిడ్ కేసులు గురువారం 3 లక్షల మార్కును దాటాయి, ఇదే ప్రపంచంలోనే అత్యధికం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. మంగళవారం ప్రధాని ప్రసంగాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ "పసలేని బోలు ప్రసంగాలు వద్దు, పరిష్కారం చూపండి" అంటూ సూటిగా అన్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ వారం కరోనా బారినపడిన విషయం తెలిసిందే

ఈ మేరకు హిందీలో ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ, ప్రస్తుతం తాను హోం క్వారైంటైన్ లో ఉన్నానని, అయితే దేశం నలుమూలల నుంచి ఎన్నో విషాదగాథలు వింటున్నట్లు చెప్పుకొచ్చారు. నేడు భారతదేశం కోవిడ్ సంక్షోభం వల్ల కాకుండా, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిందని రాహుల్ అన్నారు. కోవిడ్ నియంత్రణ కోసం మోదీ ప్రభుత్వానికి ఒక వ్యూహం అంటూ లేదని రాహుల్ విమర్శించారు. తప్పుడు ఉత్సవాలు (టీకా ఉత్సవ్), బోలు ప్రసంగాలు కాదు, దేశానికి ఒక పరిష్కారం ఇవ్వండి అని రాహుల్ ట్వీట్ చేశారు.

Here's Rahul's Tweet: 

 

అంతకుముందు టీకా ధరల పట్ల కూడా రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. "సంక్షోభం భారతదేశానికి, దీని అవసరం మోదీ మితృలది, దేశానికి చేసే అన్యాయం మోదీ ప్రభుత్వానిది" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేవలం మొదటి 30 కోట్ల డోసులనే ఉచితంగా పంపిణీ చేస్తామని చెబుతూ కేంద్ర ప్రభుత్వం టీకా పాలసీని ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి ఇచ్చే టీకా ధరలను నిర్ణయించే వెసులుబాటును వాటి తయారీదారులకు మోదీ ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ పై విధంగా వ్యాఖ్యానించారు.

ఇదే అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. "ఒకే దేశం - ఒకే రకమైన పన్ను- జీఎస్టీ" అని ప్రధాని మోదీ ప్రకటించారు. అదే మోదీ, ఇప్పుడు వ్యాక్సిన్ ధరలను వేరేలా ఎలా నిర్ణయిస్తారు. ఆ అదనపు భారాన్ని ప్రధాన్ని మోదీ 'పీఎం కేర్స్' నుంచి భరించలేరా? అని ట్వీట్ చేశారు.