File image of Shah Faesal | (Photo Credits: Twitter/@shahfaesal)

Srinagar, February 15: జమ్మూకశ్మీర్‌కు చెందిన మరో కీలక నేత, మాజీ ఐఏఎస్‌ అధికారి షా ఫైజల్‌ ని ప్రజా భద్రతా చట్టం (Public Safety Act) కింద నిర్భధించారు. ఇప్పటికే పీఎస్‌ఏ (PSA) కింద ఇప్పటికే జమ్ము కశ్మీర్‌ (Jammu and Kashmir) మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో పాటు పలువురు కశ్మీర్‌ నేతలను నిర్బంధంలోకి తీసుకున్నారు. తాజాగా వారి వరసలోకి షా ఫైజల్ కూడా చేరారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుకు (Article 370) వ్యతిరేకంగా షా ఫైజల్‌ (Shah Faesal) గళమెత్తిన సంగతి తెలిసిందే.

ఆర్టికల్‌ 370 రద్దుతో మూగబోయిన ఫోన్లు

2009లో సివిల్స్‌లో టాప్‌ ర్యాంక్‌ సాధించిన తొలి కశ్మీరీగా షా ఫైజల్‌ రికార్డు నెలకొల్పారు. గత జనవరిలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. జమ్మూ కశ్మీర్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీని స్థాపించారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్‌ 370 రద్దు అనంతర పరిస్థితుల నేపథ్యంలో విదేశాలకు వెళ్తున్న ఫైజల్‌ను గతేడాది ఆగష్టు 14న ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకొని శ్రీనగర్‌కు తిప్పి పంపించారు. అనంతరం గృహ నిర్భంధంలో ఉంచారు. దీనిపై ఆయన ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నిర్భందాన్ని సవాల్ చేస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్నెళ్లపాటు నిర్భంధంలో ఉన్న ఫైజల్‌ను తాజాగా ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ) కింద మరోసారి అదుపులోకి తీసుకున్నారు.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్

కాగా, పీఎస్‌ఏను అధికారికంగా జమ్మూ కశ్మీర్ ప్రజా భద్రతా చట్టం అని పిలుస్తారు. కలప అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఫారూక్ అబ్దుల్లా తండ్రి, మాజీ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. పీఎస్‌ఏ కింద ఎలాంటి విచారణ లేకుండా.. రెండేళ్లపాటు నిర్బంధంలో ఉంచే వీలు ఉంటుంది.