New Delhi, December 21: దేశంలో జరుగుతున్న ఆందోళనలకు కేంద్రప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Congress president Sonia Gandhi) అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులకు కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతుందని సోనియా అన్నారు. ఈ మేరకు ప్రజలను ఉద్దేశిస్తూ ఆమె ఒక వీడియోను (video message) విడుదల చేశారు.
అందులో తమ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న పౌరుల పట్ల ప్రభుత్వం (Narendra Modi government)చేస్తున్న అణచివేతను ఖండించారు. ప్రజాస్వామ్యంలో పౌరులకు తమ నిరసన తెలిపే హక్కుందని, అలాగే వారి మాటలను వినాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారం తమకు సంక్రమించిన హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు, యువత, సామాన్య పౌరులకు తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
Watch Video Issued by Congress
In a democracy people have the right to raise their voice against wrong decisions & policies of the govt & register their concerns… BJP govt has shown utter disregard for people’s voices & chosen to use brute force to suppress dissent: CP Smt. Sonia Gandhi #IndiaAgainstCAA pic.twitter.com/5AKOpn76Dx
— Congress (@INCIndia) December 20, 2019
ప్రభుత్వాలు తీసుకునే తప్పుడు నిర్ణయాలు,పాలసీలకు వ్యతిరేకంగా గళం వినిపించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న హక్కు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజల వాయిస్ ను పూర్తిగా పట్టించుకోలేదు. ప్రజల్లో ఉన్న అసమ్మతిని అణిచివేసేందుకు క్రూరమైన ఫోర్స్ ను ఉపయోగించుకోవాలని ఎంచుకుంది. దేశవ్యాప్తంగా యువత, పౌరులపై బీజేపీ ప్రభుత్వం చేసిన క్రూరమైన అణచివేతపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోందని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వ విభజన ఎజెండా మరియు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐఐటిలు, ఐఐఎంలు మరియు ఇతర ప్రముఖ విద్యాసంస్థలలో ఆకస్మిక నిరసనలు జరిగాయి. పౌరుల వాయిస్ వినడం,ఆ సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వాల విధి అని ఆమె తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం వివిక్షతతో ఉందని,ప్రతిపాదిత ఎన్ఆర్సీ ముఖ్యంగా పేదలను హర్ట్ చేసే విధంగా,హాని కలిగించేదిగా ఉందని సోనియాగాంధీ అన్నారు.
ప్రజల ప్రాధమిక హక్కులను కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుందని,భారత రాజ్యాంగం విలువలను కాపాడుతుందని సోనియాగాంధీ అన్నారు. ఈనేపథ్యంలో మీకు అండగా, రాజ్యాంగ విలువలను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రజలకు హమీ ఇస్తున్నానని వీడియోలో వ్యాఖ్యానించారు.