Hyderabad, January 25: తెలంగాణలోని 120 మునిసిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు (Telangana Municipal Election 2020 Results) ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 134 కేంద్రాలలోని 2,559 టేబుల్ల వద్ద 1,370 బృందాలు ఓట్ల లెక్కింపు (Counting) చేపడుతున్నారు. ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి.
ఉదయం 9 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని అలగిరి చిత్ర డివిజన్ లో టీఆర్ఎస్ తొలి విజయాన్ని నమోదు చేసింది. సిరిసిల్ల మున్సిపాలిటీలో 4 వార్డులు, వేములవాడలో 1 డివిజన్, పరకాల మున్సిపాలిటీలో 11 చోట్ల తెరాస (TRS) పార్టీ విజయఢంకా మోగించింది. చాలా చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆదిబట్లలో 3 చోట్ల కాంగ్రెస్, భైంసాలో 4 వార్డుల్లో ఎంఐఎం గెలుపొందింది. మధ్యాహ్నం నాటికి దాదాపు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే శనివారం సాయంత్రం నాటికి తుది ఫలితాలు వెలువడనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి నాగిరెడ్డి తెలిపారు. ఫలితాల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
జనవరి 22న జరిగిన ఎన్నికల్లో 70.26 శాతం పోలింగ్ నమోదైంది. 80 వార్డులకు కౌన్సిలర్లు, మూడు డివిజన్లకు కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత 2,971 వార్డులకు ఎన్నికలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోటీలో సుమారు 12,926 మంది అభ్యర్థులు పోటీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ 2,972 మంది అభ్యర్థులను నిలబెట్టంగా అందులో 77 మంది ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి 2,616 అభ్యర్థులు, బిజెపి నుంచి 2,313, టీడిపి నుంచి 347 బరిలో ఉన్నారు. AIMIM 276 వార్డులలో పోటీ చేస్తోంది, అందులో ఇప్పటికే 3 ఏకగ్రీవం అయ్యాయి. సిపిఐ, సిపిఎంల నుంచి వరుసగా 177, 166 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే 90 శాతం సీట్లు తామే గెలుస్తామని టీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది.
ఈనెల 27న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక జరగనుంది.