New Delhi, December 27: దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA) కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలకు మద్ధతుగా నిలుస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరియు అఖిల భారత మజ్లిస్-ఇ-ఇట్టెహాద్-ఉల్-ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసిల (Asaduddin Owiasi) పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ, ఒవైసీ కలిసి ఈ దేశాన్ని విభజిస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఆ నాయకులు ఇద్దరూ భారతదేశంలో అంతర్యుద్ధాన్ని కోరుకుంటున్నారని మంత్రి ధ్వజమెత్తారు.
గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, "అప్పట్లో మొఘలులు మరియు బ్రిటిషర్లు దేశాన్ని ఏదైతే చేయలేకపోయారో ఇప్పుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్, తుక్డే-తుక్డే ముఠా మరియు ఒవైసీ పనిగట్టుకొని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. దేశంలో సివిల్ వార్ జరగాలని కోరుకుంటున్నారు". అని మంత్రి వ్యాఖ్యానించారు.
Giriraj SIngh's Statement:
Union Minister Giriraj Singh in Delhi: What Mughals and Britishers could not do, that Rahul Gandhi, Congress, tukde-tukde gang and Owaisi want to do. They want to divide India. They want a civil war in India. pic.twitter.com/QF79LP5bLU
— ANI (@ANI) December 26, 2019
అంతకుముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ (PM Narenddra Modi) ని ఒక అబద్ధాలకోరుగా వ్యాఖ్యానించారు. దేశంలో డిటెన్షన్ కేంద్రాలు లేవని మోదీ మాట్లాడిన వీడియోని పోస్ట్ చేస్తూ, అదే వీడియోలో అస్సాంలో ఉన్న డిటెన్షన్ కేంద్రాన్ని ఎత్తిచూపారు. "ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రి భరతమాతతో కూడా అబద్ధాలు మాట్లాడతారు" అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
రాహుల్ వ్యాఖ్యల పట్ల భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. డిటెన్షన్ కేంద్రాలపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాట్రా అన్నారు. దేశ ప్రధానిని అబద్ధాలకోరుగా చెప్పటాన్ని ఆయన తప్పుపట్టారు.
మరోవైపు, పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) కు వ్యతిరేకంగా నిరసనలు (anti -CAA Protests) చేస్తున్న విద్యార్థులపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat) చేసిన విమర్శలను అసదుద్దీన్ ఒవైసి తీవ్రంగా ఖండించారు. ఆర్మీ చీఫ్ తన పని తాను చూసుకోవాలని, పరిధి దాటి మాట్లాడకూడదంటూ ఒవైసీ విమర్శించారు.
ప్రజలను, విద్యార్థులను రెచ్చగొడుతూ హింసాత్మక ఘటనలకు పాల్పడేలా వారికి నాయకత్వం వహిస్తున్న నాయకులు నిజమైన నాయకులు అనిపించుకోరని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. సిఎఎకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసాకాండను రావత్ ఖండించారు. అయితే రావత్ చేసిన ఈ వ్యాఖ్యలను ఖండించిన అసదుద్దీన్, నాయకత్వం గురించి తమకు చెప్పాల్సిన అవసరం లేదని, ముందు బిపిన్ రావత్ నాయకత్వం వహించే తన సంస్థ పరిమితి తెలుసుకోవాలంటూ రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే నిరసనకారులపై ప్రతీకారం తీర్చుకుంటాం. - సీఎం హాట్ కమెంట్స్
పొరుగున ఉన్న ఇస్లామిక్ దేశాలలో మతపరమైన హింసకు గురైన హిందువులు, సిక్కులు, పార్సీలు, జైనులు మరియు బౌద్ధులతో సహా ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం అందించే సిఎఎకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లును డిసెంబర్ 11 న పార్లమెంటు ఆమోదించింది.