 
                                                                 Huzur Nagar, October 24: హుజూర్ నగర్ ఉపఎన్నిక (Huzur Nagar Bypoll Results) లో కారు దూసుకుపోతుంది. 10వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి (Sanampudi Saidireddy) 20,500 ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. కౌంటింగ్ మొదలైన తొలి రౌండ్ నుంచి సైది రెడ్డి ఆధిక్యతనే ప్రదర్శిస్తున్నారు. ఇక ప్రధాన పోటీదారు అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మారెడ్డి ఏ రౌండ్ లోనూ ఆధిక్యత కనబర్చలేకపోయారు. ఇక మిగతా పార్టీల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం 22 రౌండ్లు కౌంటింగ్ కొనసాగనుంది. సైదిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతుండటంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. టీఆర్ఎస్ తమకు 30వేల ఆధిక్యంతో గెలుస్తామని భావించారు, అయితే ఫలితాలు అంతకంటే మెరుగ్గానే వస్తుండంతో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉత్సవ వాతావరణం కనిపిస్తుంది.
టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ , ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఈ తీర్పుతో స్పష్టమవుతుందని చెప్పారు. కౌంటింగ్ పూర్తయిన అనంతరం సీఎం కేసీఆర్ ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటానని సైదిరెడ్డి చెప్పారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
