Donald Trump (Photo- AFP)

Newyork, Jan 20: నిరుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (America Presidential Elections) ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (78) (Donald Trump) నేడు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు. అక్కడ ప్రస్తుతం మైనస్ 11 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఈ క్రమంలో ఆయన ప్రమాణ స్వీకార వేడుకను బహిరంగంగా కాకుండా కేపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్‌ లో నిర్వహించనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు అభిమానులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో వాషింగ్టన్ చేరుకున్నారు. సెయింట్ జాన్స్ చర్చిలో ప్రార్థనలతో ట్రంప్ తన రోజును ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి వైట్‌ హౌస్‌ కు చేరుకుని అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి కేపిటల్ హిల్‌ కు చేరుకుని ప్రమాణ స్వీకారం చేస్తారు.

విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ల వికృత క్రీడలు.. పాఠశాల స్టాఫ్‌ రూమ్‌ లో రాసలీలలు.. (వీడియోతో)

తొలిరోజే 100కు పైగా ఆదేశాలపై సంతకాలు

ప్రమాణం అనంతరం తొలి రోజే ట్రంప్ 100కు పైగా ఆదేశాలపై సంతకాలు చేస్తారు.  ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు ఇందులో ఉన్నట్టు సమాచారం.

'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా.. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్