Two Key Meetings In Delhi As Sena Steps Up Pressure On BJP In Maharashtra (Photo-ANI)

New Delhi, November 4: మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గత నెల 24న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ( Maha Election Results 2019) బీజేపీ-శివసేన (BJP-Shiv sena) కూటమికి పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. బీజేపీ దాని మిత్రపక్షం శివసేన మధ్య సయోధ్య కుదరడం లేదు. చెరో రెండున్నర సంవత్సరాల పాటు సీఎం సీటుని పంచుకోవాలంటూ 50:50 ఫార్ములాకు శివసేన పట్టుబడుతుంటే బీజేపీ అందుకు ఒప్పుకోవడం లేదు. బీజేపీ తమ డిమాండ్ లకు ఒప్పుకోకుంటే ఎన్సీపీ (NCP)తమకు మద్దతిచ్చేందుకు రెడీగా ఉందంటూ శివసేన బీజేపీని పరోక్షంగా హెచ్చరిస్తోంది.

ఈ సస్పెన్స్ ఇలా కొనసాగుతుంటే ఇవాళ ఢిల్లీలో రెండు మీటింగ్స్ మహారాష్ట్ర(Maharashtra)లో నెలకొన్న సందిగ్దానికి తెరదించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకుడు,మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ చీఫ్,కేంద్రహోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.

మీడియాతొ దేవేంద్ర ఫడ్నవిస్

బయటకి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు మరింత సాయం కోరేందుకే అమిత్ షా సమావేశమైనట్లు దేవేంద్ర ఫడ్నవీస్ చెబుతున్నప్పటికీ మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపైనే వీరి మధ్య ఎక్కువగా చర్చ జరిగినట్లు అర్థమవుతోంది.  170 మంది మావైపే ఉన్నారు, త్వరలో 175కి చేరుకుంటాం

అమిత్ షాతో భేటీ అనంతరం ఫడ్నవీస్ మాట్లాడుతూ మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తాను కామెంట్ చేయదల్చుకోలేదని,అయితే త్వరలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని మాత్రం చెప్పదల్చుకున్నానని,తాను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని ఫడ్నవీస్ తెలిపారు.

అమిత్ షాతో భేటీ అయిన మహా సీఎం

మరోవైపు ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమవుతున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితిని సోనియాకు పవార్ వివరించనున్నారు. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వ కాలం నవంబర్-8,2019తో ముగుస్తుంది. అప్పటిలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.