Gujarat CM Vijay Rupani Resigns: అందుకేనా..గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ రాజీనామా, నాయకత్వ మార్పు బీజేపీలో సాధారణ ప్రక్రియేనని తెలిపిన విజయ్ రూపానీ, మ‌రో ఏడాదిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు
Vijay Rupani Resigns as Gujarat Chief Minister

Gandhi Nagar, Sep 11: గుజరాత్‌ రాజకీయాల్లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా (Gujarat CM Vijay Rupani Resigns) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను శనివారం గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌కు సమర్పించారు. విజయ్‌ రూపానీ 2016 నుంచి గుజరాత్‌ సీఎంగా ఉన్నారు. గత కొంతకాలంగా విజయ్‌ రూపానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

గాంధీనగర్‌లో జరిగిన సమావేశంలో చోటుచేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో విజయ్ రూపానీ రాజీనామా (Vijay Rupani Resigns as Gujarat Chief Minister) నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజీనామా సమర్పణ అనంతరం మీడియాతో రూపానీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా సేవలందించేందుకు తనకు అవకాశం కల్పించిన బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు చెప్పారు. రాజీనామా నిర్ణయంపై అడిగిన పలు ప్రశ్నలకు... ఐదేళ్ల సుదీర్ఘ కాలం సేవలందించానని చెప్పారు.

మహిళా కానిస్టేబుల్‌తో డీఎస్పీ రాసలీలలు, వైరల్ అవుతున్న హీరాలాల్ సైనీ, మహిళా కానిస్టేబుల్ స్విమ్మింగ్ పూల్ వీడియో, చర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు

నాయకత్వ మార్పు బీజేపీలో సాధారణ ప్రక్రియేనని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నాయకత్వంలో తాను సేవలు కొనసాగిస్తున్నానని తెలిపారు. గత ఐదేళ్లుగా బీజేపీపై ప్రజలు తమ విశ్వాసాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని రూపానీ చెప్పారు. కాగా ఇటీవ‌ల ఒక స‌భ‌లో ప్ర‌సంగిస్తూ ఆయ‌న కుప్ప‌కూలిపోయారు. మ‌రో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉండ‌టం, విజ‌య్ రూపానీ ఆరోగ్య ప‌రిస్థితి స‌రిగా లేక‌పోవ‌డం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న స్థానంలో కొత్త ముఖ్య‌మంత్రిని నియ‌మించి, కొత్త ముఖ్య‌మంత్రి నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నేది బీజేపీ ఆలోచ‌న‌గా రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్న‌ది.