Credit@ Google

New Delhi, OCT 26: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ యూనిలివర్‌ (Unilever) షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తన డ్రై షాంపూ (Dry Shampoos) ఉత్పత్తులైన డవ్ (Dove), ట్రెస్మే (Tresemme ), నెక్సస్‌ (Nexxus), సువావే (Suave), టిగీ (TIGI) లాంటి షాంపూల్లో క్యాన్సర్‌ కారక కెమికల్ బెంజిన్ ఉన్నట్లు పరిశోధనల్లో యూనిలివర్ గుర్తించింది. ఈ కారణంగా వెంటనే మార్కెట్ నుంచి భారీగా వీటిని రీకాల్‌ చేసింది. కలుషితమైన ఏరోసోల్ డ్రై షాంపూ ఉత్పత్తులు ప్రమాదకరమని, వాటిని వాడొద్దని వినియోగదారులను హెచ్చరించింది. 2021కి ముందు తయారైన షాంపూలో ఈ హానికర కారకాలు (Harmful chemical) ఉన్నాయని యూనిలీవర్ తెలిపింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో రీకాల్ వివరాలను అక్టోబర్ 18న యూనిలీవర్ ప్రకటించింది. తమ అంతర్గత పరిశోధనలో ఏరోసోల్స్ ప్రొపెల్లెంట్ (aerosol products) కేన్సర్‌ కారకం బెంజీన్‌కు మూలమని కనుగొన్నట్లు తెలిపింది.

Dengue Larvae at Galaxy Apartments: సల్మాన్ నివాసంలో ప్రమాదకర దోమలు, డెంగ్యూతో ఇంట్లోనే చికిత్స పొందుతున్న కండలవీరుడు, ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ముంబై మున్సిపల్ అధికారులు, అపార్ట్‌మెంట్లో అపరిశుభ్రతపై ఆగ్రహం, పలువురికి నోటీసులు 

వీటి వాడకంతో బెంజీన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నందున అమెరికాలో పంపిణీ చేసిన ఉత్పత్తులు అన్నింటినీ రీకాల్ చేశామనీ, ఆయా ఉత్పత్తులను షెల్ఫ్‌ల నుండి తీసివేయమని రిటైలర్లను కోరింది. కాగా బెంజీన్ అధిక స్థాయిలో శరీరంలో చేరితే లుకేమియా, ప్రాణాంతక రక్త రుగ్మతలు, బోన్‌ మారో క్యాన్సర్ (Bon mare Cancer) వంటి క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే స్ప్రై ఆన్ డ్రై షాంపూలలో ప్రమాదకరమైన కలుషితాలను గుర్తించడం ఇదే మొదటి సారి కాదు.

Arunachal Pradesh Fire: ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో కాలి బూడిదైన 700 దుకాణాలు, అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌లో విషాద ఘటన 

తాజా పరిణామంతో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్లో ఏరోసోల్స్ భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. గత ఏడాదిన్నర కాలంలో జాన్సన్ అండ్‌ జాన్సన్స్ న్యూట్రోజెనా, ఎడ్జ్‌వెల్ పర్సనల్ కేర్ కంపెనీకి చెందిన బనానా బోట్ లాంటి ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నాయి. అలాగే ప్రోక్టర్ అండ్‌ గాంబుల్ స్ప్రే-ఆన్ యాంటీ పెర్స్పిరెంట్‌లు సీక్రెట్ అండ్ ఓల్డ్ స్పైస్, యూనిలివర్స్ సువేవ్ లాంటి ఉత్పత్తుల్లో బెంజీన్ కనుగొనడం, రీకాల్‌ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు వెనక్కి తీసుకున్న ఉత్పత్తుల్లో ఉండే బెంజిన్ వల్ల లుకేమియా, ఇతర బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని ఎఫ్ డీఏ తెలిపింది.