Noida Lift Horror Screen Garb from Viral video

Noida, DEC 03: మీ పిల్లలను లిఫ్ట్ లో (Child In Lift) ఒంటరిగా వదులుతున్నారా? అయితే ఈ వీడియో చూసిన తర్వాత మళ్లీ అలాంటి పని చేయరు. 98 ఒంటరిగా వదలకండి. పిల్లలను లిఫ్ట్ లో ఒంటరిగా వదిలేయడం ఎంత ప్రమాదమో తెలియజెప్పే ఘటన ఇది. ఓ ఎనిమిదేళ్ల బాలుడు అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో చిక్కుకుని నానా తంటాలు పడ్డాడు. ట్యూషన్ నుంచి తిరిగి వచ్చిన బాలుడు.. లిఫ్ట్ ఎక్కగా.. అది మధ్యలోనే ఆగిపోయింది. ఎమర్జెన్సీ బటన్ (Emergency Button) నొక్కినా తలుపులు తెరుచుకోలేదు. దీంతో బాలుడు బాగా భయపడ్డాడు. కోపం కూడా వచ్చింది. ఏం చేయాలో తెలియక గట్టిగా ఏడుపు అందుకున్నాడు. లిఫ్ట్ గోడలను బాదుతూ గట్టిగా అరిచాడు. కాసేపటికి.. బాబు అరుపులు విన్న ఓ వ్యక్తి.. లిఫ్ట్ నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. లిఫ్ట్‌లో చిన్నారి ఇరుక్కున్న సీసీటీవీ ఫుటేజ్‌ సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయ్యింది. గ్రేటర్ నోయిడా వెస్ట్ లోని నిరాలా ఆస్పైర్ సొసైటీలో (Nirala Aspire society) ఈ ఘటన జరిగింది.

గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి ఇంటికి వెళ్తున్న చిన్నారి నాలుగు, ఐదో అంతస్తు మధ్య దాదాపు 10 నిమిషాల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. అకస్మాత్తుగా లిఫ్ట్ ఆగిపోవడంతో బాలుడు బాగా భయపడ్డాడు. ట్యూషన్ నుంచి సైకిల్ లో తిరిగొచ్చిన బాలుడు.. తన సైకిల్‌తో పాటు లిఫ్ట్‌లోకి ఎక్కాడు. తను వెళ్లాల్సిన ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి.. కాసేపు సైకిల్‌పై ఎక్కేందుకు ప్రయత్నించాడు. మళ్లీ కిందకు దిగాడు. ఆ తర్వాత సడెన్ గా లిఫ్ట్ ఆగిపోవడంతో బిత్తరపోయాడు. ఏమైందోనని కంగారు పడిపోయాడు. ఆ తర్వాత లిఫ్ట్ మొదటి డోర్ మెల్లిగా ఓపెన్ చేసుకోగా.. చేతులతో లాగాడు. రెండో డోర్ ఓపెన్ కాకపోడంతో చేతితో దాన్ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాడు. అయినా, రాకపోవడంతో ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేశాడు. అప్పటికీ డోర్ ఓపెన్ కాకపోవడంతో సైకిల్‌తో లిఫ్ట్‌ డోర్లను గుద్దాడు. సాయం కోసం గట్టిగా అరుస్తూ ఏడ్చేశాడు. చివరికి బాలుడి అరుపులు విన్న ఓ వ్యక్తి వచ్చి.. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి రక్షించాడు. దాదాపు 10 నిమిషాలు బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. బాబు సురక్షితంగా లిఫ్ట్ నుంచి బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. లిఫ్ట్ డోర్ ఓపెన్ కాకపోవడంతో బాబు బాగా భయపడ్డాడు.

Chennai Woman Married 4 Times: ఈజీ మనీ కోసం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న యువతి, ఐదో పెళ్లికోసం ట్రై చేస్తుండగా అడ్డంగా పోలీసులకు బుక్కయిన కిలాడీ, 12 ఏళ్లలో 32 సిమ్ కార్డులు, వాడినట్లు గుర్తింపు 

దీనిపై బాలుడి తల్లిదండ్రులు.. సెక్యూరిటీ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. సీసీటీవీ పర్యవేక్షించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది.. తమ కుమారుడు లిఫ్ట్ లో చిక్కుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. కాగా, ఆ సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. కాగా, బాలుడు తన సైకిల్ తో పొరపాటున లిఫ్ట్ డోర్లను రెండు సార్లు గుద్దాడని, ఆ కారణంగానే లిఫ్ట్ ఎటూ కదలకుండా స్టక్ అయిపోందని సెక్యూరిటీ సిబ్బంది వివరించారు. లిఫ్ట్ ఎక్కిన సమయంలో.. లిఫ్ట్ డోర్లకు దూరంగా ఉండాలని, సైకిళ్లను కదలకుండా ఉంచాలని తల్లిదండ్రులు తమ పిల్లలతో చెప్పాలని సెక్యూరిటీ సిబ్బంది కోరారు.

Noida Shocker: ప్రియుడితో జంప్ అయ్యేందుకు టీవీ సిరీస్ చూసి భారీ స్కెచ్‌, అచ్చం తనలాగే ఉన్న యువతిని హత్యచేసి తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించింది, నిజం ఎలా బయటపడిందంటే? 

లిఫ్ట్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని, ఇటీవలే దాన్ని రిపేర్ చేయించామని తెలిపారు. ఈ ఘటనపై లిఫ్ట్ కంపెనీకి ఫిర్యాదు చేశామని, అసలేం జరిగిందో తెలుసుకోవాలని చెప్పామన్నారు. మొత్తంగా, బాలుడు సేఫ్ గా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పిల్లల తల్లిదండ్రుల్లో భయాందోళన నింపింది. కాగా, తల్లిదండ్రులకు ఇది ఓ హెచ్చరిక లాంటిది. తమ పిల్లలను ఒంటరిగా లిఫ్ట్ లోకి వెళ్లనీయకపోవడం మంచిది.