File image of Congress chief Sonia Gandhi | (Photo Credits: PTI)

New Delhi, May 24: సంస్థాగత మార్పులే లక్ష్యంగా ఇటీవలే రాజస్థాన వేదికగా కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ శిబిర్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024లో రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకొని, టాస్క్‌ఫోర్స్ 2024 ను (Congress Task Force 2024) కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ( Sonia Gandhi) మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది.

అత్యంత కీల‌క‌మైన ఈ క‌మిటీలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీకి స్థానం ద‌క్కింది. రాహుల్ గాంధీకి అత్యంత కీల‌క‌మైన ఈ క‌మిటీలో స్థానం ద‌క్క‌లేదు. అయితే రాహుల్‌కు పొలిటికల్ అఫైర్స్ క‌మిటీలో స్థానం ద‌క్కింది.చింత‌న్ శిబిర్‌లో ప్రియాంక గాంధీని అధ్య‌క్షురాలు చేయాల‌ని ఒక్క‌సారిగా డిమాండ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టాస్క్‌ఫోర్స్ క‌మిటీలో ప్రియాంక‌కు స్థానం ద‌క్క‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇక ఈ కమిటీల్లో అసమ్మతి నేతల(జీ-23)కు సైతం చోటుదక్కడం విశేషం.

జపాన్ వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ భేటీ, ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపిఇఎఫ్) కోసం భారత్ పనిచేస్తుందని వెల్లడి

మరోవైపు.. క‌శ్మీర్ నుంచి క‌న్యా కుమారి వ‌ర‌కూ దేశ వ్యాప్తంగా రాహుల్ పాద‌యాత్ర(భార‌త్ జోడే యాత్ర) చేయాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వున్న నిరుద్యోగ స‌మ‌స్య‌ను హైలెట్ చేయాల‌ని నిర్ణ‌యించింది. భారత్‌ జోడే యాత్రకు సంబంధించి కూడా సోనియా ఓ క‌మిటీని ప్ర‌క‌టించారు.

కమిటీల్లో సభ్యులు వీరే..

పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ..

- రాహుల్ గాంధీ

- గులాంన‌బీ ఆజాద్‌

- దిగ్విజ‌య్ సింగ్‌

- మ‌ల్లికార్జున ఖ‌ర్గే

- కేసీ వేణుగోపాల్‌

- అంబికా సోనీ

- ఆనంద్ శ‌ర్మ‌

- జితేంద్ర సింగ్‌.

టాస్క్‌ఫోర్స్ 2024 క‌మిటీ..

- ప్రియాంక గాంధీ

- కేసీ వేణుగోపాల్‌

- ర‌ణ‌దీప్ సూర్జేవాలా

- చిదంబ‌రం

- ముకుల్ వాస్నిక్‌

- జ‌య‌రాం ర‌మేశ్‌

- అజ‌య్ మాకెన్‌

- సునీల్ క‌నుగోలు

భార‌త్ జోడే పాద‌యాత్ర క‌మిటీ

- శ‌శి థ‌రూర్‌

- స‌చిన్ పైల‌ట్‌

- దిగ్విజ‌య్ సింగ్‌

- కేజే జార్జ్‌

- రంవీత్ సింగ్ బిట్టూ

- ప్ర‌ద్యుత్ బోల్‌దోలోయీ

- జీతూ ప‌ట్దారి

- స‌లీమ్ అహ్మ‌ద్‌